News February 24, 2025
జగిత్యాల: రేపట్నుంచి ప్రచారం నిషేధం: కలెక్టర్

MDK, NZB, KNR, ALD పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా ఈ నెల 25 సాయంత్రం 4.00 నుంచి ఈ నెల 27 సాయంత్రం 4.00 వరకు బహిరంగ సభలు, ఊరేగింపులు సమావేశాలు నిర్వహించడం, ప్రచారం చేయడం, బల్క్ ఎస్ఎంఎస్‌లు పంపడంపై నిషేధమన్నారు.
Similar News
News February 25, 2025
WPL చరిత్రలో తొలి సూపర్ ఓవర్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం నమోదైంది. బెంగళూరు, యూపీ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. తొలుత RCB 180 రన్స్ చేసింది. ఛేదనలో యూపీ కూడా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టోర్నీ చరిత్రలో తొలిసారి సూపర్ ఓవర్ జరగనుంది.
News February 25, 2025
సజావుగా ఎన్నికలు నిర్వహించండి: కలెక్టర్

ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఎన్నికల సిబ్బందికి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో పిఒ, ఎపిఓ, ఓపిఓ, రూట్, సెక్టోరల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ సరళి మాత్రమే చూసుకుంటే సరిపోదని, అనవసర వ్యక్తులను పోలింగ్ స్టేషన్ పరిధిలోకి రాకుండా, వారిని నియంత్రించే బాధ్యత కూడా చేపట్టాలని ఆదేశించారు.
News February 25, 2025
ఎటు వైపు తిరిగి నిద్రపోతే మంచిది?

ఏ వయసు వారైనా నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉండదని చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ, గుండె ఆరోగ్యం మెరుగుపడతాయని, ఆయాసం నుంచి ఉపశమనం కలిగి శ్వాస తీసుకోవడం సులభంగా మారుతుందని పేర్కొంటున్నారు. శారీరక నొప్పులు రాకుండా ఉండేందుకు అప్పుడప్పుడు కుడి వైపు, వెల్లకిలా పడుకోవాలని సూచిస్తున్నారు.