News February 24, 2025
రేవంత్ చుట్టూ భజనపరులు: అంజన్ కుమార్ యాదవ్

TG: సీఎం రేవంత్ చుట్టూ భజనపరులు ఉన్నారని కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. గతంలో రేవంత్‌ను సొంత కులం నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి ఇబ్బంది పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అప్పుడు రేవంత్‌ను ఇబ్బంది పెట్టినవారు ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారు. దానం నాగేందర్ వల్లే సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ ఓడింది. నేను పోటీ చేసి ఉంటే గెలిచేవాళ్లం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News January 15, 2026
ఐఐటీ రూర్కీలో నాన్ టీచింగ్ పోస్టులు

<
News January 15, 2026
సంక్రాంతి: నువ్వుల లడ్డూ తిన్నారా?

సూర్యుడు తన కుమారుడైన శనిదేవుని ఇంటికి వెళ్లే రోజే సంక్రాంతి. శనిదేవుడు నల్ల నువ్వులతో తండ్రిని పూజించడంతో వారి మధ్య వైరం తొలగిపోయింది. అందుకే నేడు నువ్వులు తినాలని పండితులు, పెద్దలు చెబుతారు. దీనివల్ల శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. శాస్త్రీయంగా చూసినా చలికాలంలో వాటిని తింటే అనేక లాభాలున్నాయి. రోగనిరోధక శక్తిని అందిస్తాయి. అందుకే పండక్కి నువ్వుల లడ్డూలు చేస్తారు. మరి మీరు తిన్నారా? COMMENT
News January 15, 2026
కోళ్ల పెంపకంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది

వారాంతపు సంతలో కోళ్లను కొని కొందరు పెంపకందారులు వాటిని తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉన్న కోళ్లలో కలుపుతారు. అయితే కొత్తగా తెచ్చిన కోళ్లకు వ్యాధులుంటే మొత్తం అన్ని కోళ్లకు సోకి మరణిస్తాయి. ఈ పద్ధతిని మానేయాలి. పెద్ద కోళ్లను, కోడి పిల్లలను కలిపి కాకుండా వాటి వయసుకు తగ్గట్లు ప్రత్యేకంగా పెంచాలి. కోళ్ల షెడ్‌ను శుభ్రం చేశాకే కొత్త కోళ్లను వదలాలి. కోళ్ల షెడ్డులోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి.


