News February 24, 2025
కావలిలో మున్సిపల్ కార్మికుల పోస్ట్ కార్డులు ఉద్యమం

కావలి మున్సిపల్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ద్వారా అప్కాస్ రద్దు, ప్రైవేటు ఏజెన్సీ వద్దని, తమను పర్మినేoట్ చేయాలని కోరుతూ సోమవారం కార్మికులు పోస్ట్ కార్డులు ప్రదర్శిస్తూ ఉద్యమాన్ని చేపట్టారు. సీఐటీయూ నేత పి.పెంచలయ్య మాట్లాడుతూ.. గతంలో ప్రైవేటు కాంట్రాక్టులో ఉన్నప్పుడు కార్మికులు జీతాల కొసం ఇబ్బందులు పడ్డారన్నారు. మళ్లీ సీఎం ఆ నిర్ణయాన్ని అమలు చేయడం మంచిది కాదని అన్నారు.
Similar News
News February 25, 2025
హౌసింగ్ డిమాండ్ సర్వేను వేగంగా పూర్తి చేయండి : కలెక్టర్

జిల్లాలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరూ ఉండకూడదని, అర్హులైన పేదలందరికీ ఇల్లు మంజూరు చేయడమే లక్ష్యంగా పీఎమ్ఏవై 2.0 డిమాండ్ సర్వేను వేగంగా చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇల్లు లేని పేదలు ఎవరూ ఉండకూడదని లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
News February 24, 2025
అసెంబ్లీలో జగన్ లేకపోతే సందడే లేదు: MLA సోమిరెడ్డి

పులివెందులలో ఓడిపోతాననే భయంతోనే జగన్ అసెంబ్లీకి వస్తున్నారని MLA సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి 60 రోజులు రాకపోతే సభ్యత్వం రద్దవుతుందనే భయం జగన్‌కు ఉందని, అసెంబ్లీలో ఆయన లేకపోతే సందడే లేదన్నారు. ఓ వైపు జగన్, మరోవైపు కాకాణి పదే పదే బట్టలిప్పుతాన్నంటున్నారని హో మంత్రి వారి మీచ చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ కేవలం ఫ్లోర్ లీడర్ అన్న సోమిరెడ్డి.. ఆయనకు దురాశ పనికి రాదని ఎద్దేవా చేశారు.
News February 24, 2025
నెల్లూరు: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్లిందన్న మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు నగరం కపాడిపాలెంలో చోటుచేసుకుంది. కపాడిపాలెంకు చెందిన శ్రావణ్ కారు డ్రైవర్‌గా భార్య సుమాంజలి నర్స్‌గా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం. ఇటీవల వారి మధ్య చిన్నపాటి గొడవ జరగ్గా భార్య పుట్టింటికి వెళ్లింది. మనస్తాప చెందిన శ్రావణ్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.