News February 24, 2025
HYD: ACB రైడ్స్‌లో పట్టుబడ్డ బిల్ కలెక్టర్

హైదరాబాద్‌లో ACB అధికారులు మెరుపుదాడులు చేస్తున్నారు. సోమవారం GHMC రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో రైడ్స్ చేశారు. ACB వివరాలు.. బిల్ కలెక్టర్ మధు ఓ పరిశ్రమకు సంబంధించి ఆస్తి పన్ను పెంచకుండా ఉండేందుకు రూ. లక్ష డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా తన ప్రైవేట్ అసిస్టెంట్ రమేశ్ ద్వారా రూ. 45,000 తీసుకుంటూ మధు పట్టుబడ్డాడు. అధికారులు దర్యాప్తు చేపట్టారు. లంచం అడిగితే 1064కు డయల్ చేయాలని ACB సూచించింది.
Similar News
News February 25, 2025
నగరవాసులకు హైడ్రా హెచ్చరిక

ప్రజావాణిలో ఫిర్యాదు చేసేటప్పుడు భూ సమస్యలు, కోర్టులో పెండింగ్‌లో ఉంటే వాటి వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలని హైడ్రా సూచించింది. ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. వ్యక్తిగత వివాదాలు పరిష్కరించబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వ భూముల అక్రమ కబ్జాలపై మాత్రమే ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపింది.
News February 24, 2025
HYD: మైనర్లపై అధికారుల నిఘా..!

మాదకద్రవ్యాలపైనే కాదు మైనర్లకు సిగరెట్ అమ్మకాలపైనా అధికారులు HYDలో నిఘా పెంచారు. దీనికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు TG యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యా తెలిపారు. ఇవి సెల్‌ఫోన్‌లతో పాటు సీక్రెట్ కెమెరాలతో వీడియోలు తీస్తుంటాయి. ఈ వీడియోల ఆధరాంగా వ్యాపారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఈ బృందాలు కొనసాగుతాయిని ఆయన వెల్లడించారు.
News February 24, 2025
రంగారెడ్డి జిల్లాలో అసాధారణ వాతావరణ పరిస్థితులు

రంగారెడ్డి జిల్లాలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి నేపథ్యంలో జిల్లాలో పగటి సమయంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కాగా రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో రాత్రుళ్లు చలి అధికంగా ఉంటోంది. అయితే పగటివేళల్లో అనేక ప్రాంతాలు ఎల్లో జోన్లో ఉండగా రాత్రి సమయాల్లోనూ పలు ప్రాంతాలు ఎల్లో జోన్లో కొనసాగుతున్నాయి.