News February 24, 2025
శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చిన గవర్నర్

శ్రీశైలం మల్లన్న దర్శనార్థమై రాష్ట్ర గవర్నర్ శ్రీశైలం చేరుకున్నారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్ వద్ద మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఫారుక్, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
Similar News
News July 4, 2025
రామాపురం వద్ద ఎదురెదురు ఢీకొన్న కార్లు

రాయచోటి నియోజకవర్గం రామాపురం NH 44 నల్లగుట్టపల్లి వద్ద శుక్రవారం మధ్యాహ్నం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కొండవాండ్లపల్లికి చెందిన నర్సిపల్లి నాగేందర్‌రెడ్డి కారును ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్ నిద్రమత్తులో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నాగేందర్‌రెడ్డి కారులో ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 4, 2025
ఖాళీ అవుతోన్న ‘తువాలు’

పసిఫిక్ మహాసముద్రంలోని కేవలం 5 మీటర్ల ఎత్తులో ఉండే ‘తువాలు’ దేశం ఖాళీ అవుతోంది. కొన్ని దీవుల సముదాయమైన ఈ దేశంలోని మెజారిటీ భూభాగం 2050 నాటికి సముద్రంలో కలిసిపోతుందని NASA హెచ్చరించడంతో ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. ఈక్రమంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఒప్పందంతో ‘క్లైమెట్ వీసా’ కోసం దేశంలోని 10643 మందిలో మూడో వంతు ప్రజలు అప్లై చేసుకున్నారు. కానీ ఏడాదికి 280 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు.
News July 4, 2025
నరసరావుపేట: మొహరం సందర్భంగా పటిష్ట బందోబస్తు

మొహరం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. మొహరం వేడుకలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని గ్రామాల్లో ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చట్ట విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరూ సోదర భావంతో మెలగాలని, ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరిగే విధంగా ప్రజలందరూ సహకరించాలని కోరారు.