News February 24, 2025

గుడిహత్నూర్: అత్తపై దాడి చేసిన అల్లుడు అరెస్ట్

image

అత్తపై గొడ్డలితో దాడి చేసిన అల్లుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు. గుడిహత్నూర్ మండలం కమలాపూర్ గ్రామంలో ఆదివారం వెంకటి(40) తన భార్యతో గొడవపడుతుండగా అతడి అత్త శశికళ మధ్యలోకి వెళ్లింది. దీంతో వెంకటి ఆమెపై గొడ్డలితో దాడి చేయడంతో మెడ భాగంలో తీవ్రగాయమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News February 25, 2025

ఆదిలాబాద్: ఈనెల 28 వరకు వారోత్సవాలు

image

ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అందుకు తప్పనిసరిగా బాధ్యతగా డబ్బును పొదుపు చేసి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆర్బీఐ వారోత్సవాల్లో భాగంగా ఆర్థిక క్రమశిక్షణ వారోత్సవాలను నిర్వస్తున్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వారోత్సవాల పోస్టర్లను అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ నెల 24 నుంచి 28 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News February 24, 2025

ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి: ADB కలెక్టర్

image

శాసన మండలి ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల నిబంధనలు, సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. ఈ నెల 27న జిల్లాలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిపించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించి నివేదికలను త్వరగా అందజేయాలన్నారు.

News February 24, 2025

ADB: INSTAలో పరిచయం.. వేధింపులు.. చివరికి అరెస్ట్

image

INSTAGRAMలో పరిచయమైన ఓ వివాహితను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ 1 TOWN CI సునీల్ కుమార్ తెలిపారు. వివరాలు.. AP ఈస్ట్ గోదావరికి చెందిన ఆనంద్‌కు ADBకి చెందిన వివాహితతో INSTAలో పరిచయం ఏర్పడింది. తరచూ వీరు చాట్, వీడియో కాల్స్ చేసుకునేవారు. వాటిని స్క్రీన్ షాట్స్ తీసిన ఆనంద్.. నగ్నంగా వీడియో కాల్స్ చేయాలని వేధించేవాడు. దీంతో ఆమె FEB 4న ఫిర్యాదు చేసింది.

error: Content is protected !!