News February 24, 2025

యాగంటి క్షేత్రానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

image

మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రానికి వెళ్లే భక్తులకు దేవస్థానం వారు సోమవారం శుభవార్త చెప్పారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వరకు టోల్గేట్ రుసుము మినహాయింపు ఇస్తున్నట్లు దేవస్థానం ఈవో చంద్రుడు తెలిపారు. అలాగే విచ్చేయు భక్తులకు ఒక లడ్డు ప్రసాదం ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

Similar News

News January 9, 2026

ఈ OTTలోకి ప్రభాస్ ‘రాజాసాబ్’

image

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాజాసాబ్’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చేసింది. హారర్ కామెడీ జానర్‌లో ప్రభాస్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్ర డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం OTTలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు.

News January 9, 2026

అలర్ట్.. 13న అమలాపురంలో జాబ్ మేళా

image

ఈనెల 13న అమలాపురం కలెక్టరేట్లోని ‘వికాస’ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సాధించాలని కోరారు. యువత ఉపాధిని వేగవంతం చేసేందుకు, కార్పొరేట్ సంస్థలతో అనుసంధానం పెంచేందుకు ఈ ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు ఆయన వివరించారు.

News January 9, 2026

నెల్లూరు జైలును తనిఖీ చేసిన హోంమంత్రి అనిత

image

వెంకటాచలం మండలం చెముడుగుంటలోని నెల్లూరు సెంట్రల్ జైలును హోం మంత్రి అనిత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైల్లోని వసతులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వైసీపీ నేతలు ఆయనతో ములాఖాత్ అవుతున్న నేపథ్యంలో ఆమె ఆకస్మిక తనిఖీలు ప్రాధాన్యతను సంతరించుకుంది.