News February 24, 2025
త్వరలో నెస్లే ఇండియా ఉత్పత్తుల ధరలు పెంపు

తమ ఉత్పత్తుల ధరలను స్వల్పంగా పెంచాలని Nestle India యోచిస్తోంది. కాఫీ, కోకో, వంట నూనెల ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ MD సురేశ్ నారాయణన్ తెలిపారు. ద్రవ్యోల్బణం, అధిక ఉత్పత్తి ధరల కారణంగా తమకు లాభాలు తగ్గాయని పేర్కొన్నారు. కేంద్రం వ్యక్తిగత ఆదాయ పన్నులను తగ్గించడంతో వినియోగదారుల వద్ద డబ్బులు మిగులుతాయని, దీంతో తమ ఉత్పత్తుల వినియోగం పెరిగే ఛాన్సుందని అంచనా వేశారు.
Similar News
News September 15, 2025
రూ.5కే కిలో టమాటా

AP: ఓవైపు తగ్గిన ఉల్లి ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తుంటే టమాటా ధరలూ అదే బాటలో పయనిస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్‌లో ఇవాళ టమాటా ధరలు కేజీ రూ.5కు పడిపోయాయి. దిగుబడి పెరగడంతో ధరలు పతనమవుతున్నాయి. దీంతో గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. మీ ఏరియాలో టమాటా ధర ఎంత ఉందో కామెంట్ చేయండి?
News September 15, 2025
AI కంటెంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం?

ఏఐ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇకపై ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఫొటోలు, ఆర్టికల్స్ అన్నింటికీ కచ్చితంగా లేబుల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా రిపోర్టును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. ఏఐ కంటెంట్ సాధారణ పౌరులతోపాటు వీఐపీలను కూడా అయోమయానికి గురి చేస్తోందని పేర్కొంది.
News September 15, 2025
రాయలసీమ కోనసీమ అవుతోంది: సీఎం

AP: రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ లాంటి విధానాలతో మంచి ఫలితాలు సాధించామని, ఇప్పుడది కోనసీమగా మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. పట్టిసీమతో డెల్టాలో వాడే కృష్ణానీటిని పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగామని తెలిపారు. హంద్రీనీవా కాలువతో కుప్పం వరకూ కృష్ణా నీళ్లు తీసుకెళ్లామన్నారు. వాణిజ్య పంటల విషయంలోనూ సరైన సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభం వచ్చేలా చేయాలని కలెక్టర్లకు సూచించారు.