News February 24, 2025
ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి: ADB కలెక్టర్

శాసన మండలి ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల నిబంధనలు, సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. ఈ నెల 27న జిల్లాలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిపించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించి నివేదికలను త్వరగా అందజేయాలన్నారు.
Similar News
News January 17, 2026
ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ బదిలీ

ఉట్నూర్ అదనపు ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కాజల్ సింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్‌ల బదిలీలు చేపడుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏఎస్పీ కాజల్ సింగ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ 2 డీసీపీగా బదిలీ చేశారు. కొంత కాలంగా ఉట్నూర్ ఏఎస్పీగా ఉన్న ఆమె పలు కేసుల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించారు.
News January 17, 2026
ఆదిలాబాద్: భక్తుల ఇంటికే మేడారం ప్రసాదం

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని భక్తుల ఇంటికే ప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు ఉమ్మడి ADB ఆర్టీసీ ఆర్ఎం భవాని ప్రసాద్ తెలిపారు. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు అమ్మవారి ప్రసాదాన్ని భక్తులు tgsrtcologistics.co.in వెబ్ సైట్, ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చన్నారు. అమ్మవార్ల ఫొటో, పసుపు, కుంకుమ, బెల్లం ప్రసాదం అందించడం జరుగుతుందన్నారు.
News January 16, 2026
ADB రిమ్స్‌లో పోస్టులకు దరఖాస్తులు

ADB రిమ్స్ వైద్య కళాశాలలో వివిధ విభాగంలో డాక్టర్ పోస్టులను గౌరవ వేతనంతో పాటు కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేస్తున్నట్లు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. అర్హులైన ట్యూటర్స్, సీఎంఓ, సివిల్ అసిస్టెంట్ సర్జన్, సీనియర్ రెసిడెంట్స్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. వివరాలకు rimsadilabad.org, adilabad.telangana.gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలన్నారు. ఈ నెల 23న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.


