News February 24, 2025

కృష్ణా జిల్లాలో 48 గంటలు మద్యం దుకాణాలు బంద్

image

కృష్ణా జిల్లాలో ఈ నెల 27వ తేదీన MLC ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలింగ్‌కు 48 గంటల ముందు జిల్లాలో మద్యం దుకాణాలను మూసి వేస్తున్నట్టు కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో సోమవారం తెలిపారు. 25వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి 27వ తేదీన సాయంత్రం 4 వరకు డ్రై డేగా పాటించి తప్పనిసరిగా మద్యం దుకాణాలను మూసి వేయాలన్నారు. ఉత్తర్వులను బేఖాతరు చేస్తే సంబంధిత మద్యం దుకాణాల లైసెన్స్‌లు రద్దువతాయని హెచ్చరించారు.

Similar News

News February 25, 2025

కృష్ణా : గ్యాస్ ఏజెన్సీలకు డీఎస్ఓ హెచ్చరిక

image

దీపం-2 ప‌థ‌కం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల‌కు అద‌నంగా నగదు వ‌సూలు చేసినట్లు ఫిర్యాదులు రుజువైతే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు ర‌ద్దు చేస్తామని కృష్ణాజిల్లా పౌరసరఫరాల అధికారి వి. పార్వతి హెచ్చరించారు. దీపం-2 ప‌థ‌కం అమ‌లు, ఐవీఆర్ఎస్ స‌ర్వే నివేదిక‌లు, ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్న చర్య‌లపై సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌ మీటింగ్ హాలులో స‌మావేశం నిర్వహించారు.

News February 25, 2025

కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* కృష్ణ: 48 గంటలు మద్యం దుకాణాల బంద్ * కంకిపాడులో దారి దోపిడీ ముఠా అరెస్ట్ * కృష్ణా: ధ్రువీకరించని యాప్‌స్‌తో జాగ్రత్త: SP * బాపులపాడు: యువకుల మృతికి కారణమిదే * విజయవాడ: వ్యభిచార గృహంపై పోలీసులు దాడి * కృష్ణా: PDF అభ్యర్థికి జగన్ మద్దతు * శివరాత్రికి సిద్ధమవుతున్న యనమలకుదురు * గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసులో ముగ్గురి అరెస్ట్

News February 24, 2025

ధ్రువీకరించని లోన్ యాప్స్‌తో జాగ్రత్త: ఎస్పీ

image

ధ్రువీకరించని లోన్ యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ఆర్. గంగాధర్ ప్రకటనలో తెలిపారు. బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ లేకపోయినా, సిబిల్ స్కోర్ లేకపోయినా లోన్ ఇస్తామంటూ ఆకర్షిస్తారు. వ్యక్తిగత సమాచారం దోచేసి తిరిగి మిమ్మల్ని బెదిరించి మీ వద్ద నుంచి భారీ మొత్తంలో డిమాండ్ చేస్తారని అన్నారు. సైబర్ నేరానికి గురైనప్పుడు 1930 నంబర్‌ను సంప్రదించాలన్నారు. 

error: Content is protected !!