News February 24, 2025

యూజీసీ జేఆర్ఎఫ్ సాధించిన ఏయూ విద్యార్థి

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగ విద్యార్థి శ్యామ్ యూజీసీ జేఆర్ఎఫ్ సాధించాడు. దివ్యాంగుడైన శ్యామ్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ప్రతిభ అర్హత పరీక్షలో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ జేఆర్ఎఫ్ సాధించడం పట్ల విభాగాధిపతి ఆచార్య పేటేటి ప్రేమానందం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి శ్యామ్‌ని విభాగంలో సత్కరించారు. శ్యామ్ నుంచి యువత స్ఫూర్తి పొందాలని చెప్పారు.

Similar News

News September 15, 2025

విశాఖలో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లకు బదిలీ

image

విశాఖ నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లకు బదిలీ చేస్తూ సీపీ శంఖబ్రత బాగ్చి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంవీపీ సీఐ మురళి, వెస్ట్‌ జోన్‌ క్రైమ్‌ సీఐ శ్రీనివాసరావులను విశాఖ రేంజ్‌కు సరెండర్‌ చేశారు. ఎంవీపీ లా అండ్‌ ఆర్డర్‌ సీఐగా ప్రసాద్, వెస్ట్‌ జోన్‌ క్రైమ్‌కు చంద్రమౌళి, ద్వారకా ట్రాఫిక్‌కు ప్రభాకరరావు, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సిటీ వీఆర్‌లో ఉన్న భాస్కరరావును నియమించారు.

News September 15, 2025

విశాఖ: బస్సుల్లో రద్దీ.. ప్రయాణ సమయాలు మార్చుకోవాలని పిలుపు

image

స్త్రీ శక్తి పథకంతో జిల్లాలోని బస్సుల్లో రద్దీ పెరిగిందని, RTC ప్రయాణికులు తమ ప్రయాణ సమయాలను మార్చుకోవాలని RTC విశాఖ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు సూచించారు. రద్దీకి తగ్గట్లు ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవడం లేదన్నారు. ఉదయం 7 నుంచి 10, సా. 4- 7 గంటల వరకు విద్యార్థులు, కార్మికులు, ఇతర ప్రయాణికుల రద్దీ ఉంటోందన్నారు. దీంతో ఉ.10 నుంచి, సా.7 తర్వాత ప్రయాణాలు చేసేలా చూసుకోవాలని మహిళలు, ప్రయాణికులను కోరారు.

News September 15, 2025

మధురవాడలో ముగిసిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు

image

మధురవాడ శిల్పారామంలో రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు విజయవంతంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో సుమారు 200 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు. ముగింపు వేడుకల్లో సీపీ శంఖబ్రత బాగ్చి పాల్గొని విజేతలకు మెడల్స్ అందజేశారు. అనంతరం మహిళలకు ఆత్మరక్షణలో తైక్వాండో ప్రాధాన్యాన్ని వివరించారు.