News February 24, 2025

MDK: నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

image

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరిలోని నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అకాడమిలో వివిధ దేశాల సివిల్ సర్వీస్ అధికారులకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అతిధి ఉపన్యాసం ఇచ్చారు. ఈ సంద్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ మన రాష్ట్రంలో అమలవుతున్న స్థానిక పాలనపై సుదీర్ఘంగా తన అనుభవాలను పంచుకున్నామని అన్నారు. వాళ్లందరికీ కొన్ని విలువైన సలహాలు సూచనలు చేశామని తెలిపారు.

Similar News

News September 13, 2025

మెదక్: తైబజార్ వసూళ్లు రద్దుకు ఆదేశం

image

మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మెదక్‌లో గిరిజన మహిళపై దురుసుగా ప్రవర్తించడం బాధాకరమని అన్నారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో తైబజార్ రద్దు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గిరిజన మహిళపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి పైన కేసు నమోదు చేయాలని డీఎస్పీకి సూచించారు.

News September 13, 2025

రాష్ట్ర కళా ఉత్సవ్‌కు మెదక్ జిల్లా విద్యార్థులు ఎంపిక

image

రాష్ట్ర స్థాయిలో జరిగే కళా ఉత్సవ్-2025 పోటీలకు మెదక్ జిల్లా నుంచి పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని డీఈఓ రాధా కిషన్ తెలిపారు. వ్యక్తిగత విభాగంలో ఎస్. కౌడిపల్లి, బాలాజీ, శ్రీహర్షిని, ఆర్తిచంద్ర, సాత్విక్ ఎంపిక కాగా, బృందంలో స్పందన, మహేష్, కావేరి, సుర్తిత్రిక, పవన్ ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. వీరిని డీఈఓ , పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

News September 12, 2025

పెద్ద శంకరంపేట : మనస్థాపంతో బావిలో దూకి యువకుడి మృతి

image

పెద్ద శంకరంపేట మండలంలోని ముసపేటకి చెందిన గంగమేశ్వర్ మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళిఅతడు తిరిగి రాలేదు. గంగమేశ్వర్ ఇటీవల ఓ కేసులో జైలుకు వెళ్ళి పది రోజుల క్రితమే బెయిల్ మీద బయటకు వచ్చాడు. మనస్థాపంతోనే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తండ్రి దేవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.