News February 24, 2025
ఫైబర్‌నెట్ ఎండీ దినేశ్ కుమార్‌పై వేటు

AP: ఫైబర్‌నెట్ ఎండీ దినేశ్ కుమార్‌పై వేటు పడింది. ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీకి రిపోర్టు చేయాలని దినేశ్ కుమార్‌ను ఆదేశించింది. మరోవైపు ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. కాగా ఫైబర్‌నెట్‌కు చెందిన పూర్తి నివేదిక సీఎం చంద్రబాబు దగ్గరికి చేరినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగానే ఎండీని జీఏడీకి అటాచ్ చేసినట్లు సమాచారం.
Similar News
News December 26, 2025
ఏగిలిచేస్తే ఏలనివానికైనా పండుతుంది

ఏగిలి చేయడం అంటే పొలాన్ని బాగా దున్నడం, చదును లేదా దమ్ము చేయడం అని అర్థం. ఏలనివానికైనా అంటే ఏమీ తెలియని వాడని అర్థం. సాగు చేయాలనుకునే నేలను బాగా చదును చేసి, దున్ని సరైన సమయంలో విత్తనం వేస్తే, వ్యవసాయం గురించి పెద్దగా అనుభవం లేని వారికైనా సరే పంట బాగా పండుతుంది. అంటే మన కష్టం మరియు నేల సత్తువ మీదే పంట దిగుబడి, ఆదాయం ఆధారపడి ఉంటుందని ఈ సామెత అంతరార్థం.
News December 26, 2025
బాక్సింగ్ డే టెస్ట్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

The Ashes: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న 4వ టెస్టులో ENG కెప్టెన్ స్టోక్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. 3 టెస్టుల్లోనూ ఓడిన ఇంగ్లండ్ ఈ టెస్టులోనైనా గెలిచి బోణి కొడుతుందేమో చూడాలి.
AUS: హెడ్, వెదరాల్డ్, లబుషేన్, స్మిత్(C), ఖవాజా, కేరీ, గ్రీన్, నేజర్, స్టార్క్, రిచర్డ్‌సన్, బోలాండ్
ENG: క్రాలే, డకెట్, బెథెల్, రూట్, బ్రూక్, స్టోక్స్(C), స్మిత్, విల్ జాక్స్, అట్కిన్సన్, కార్స్, టంగ్
News December 26, 2025
నేడు తెల్ల దుస్తులు ధరిస్తే..?

శుక్రవారం శుక్రుడికి, జ్ఞాన ప్రదాత సరస్వతీ దేవికి ప్రశస్తమైన రోజు. శుక్ర గ్రహం శాంతికి, స్వచ్ఛతకు, విలాసానికి చిహ్నం. అందుకే ఈ రోజున తెల్లని దుస్తులు ధరించడం వల్ల శుక్రుడి అనుగ్రహం లభించి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తెలుపు రంగు సాత్విక గుణాన్ని పెంపొందిస్తుంది. సరస్వతీ దేవి కూడా శ్వేత వస్త్రధారిణి. తెల్లని దుస్తులు ధరించి ఆ తల్లిని పూజించడం వల్ల ఏకాగ్రత, మేధస్సు వృద్ధి చెందుతాయని నమ్మకం.


