News February 24, 2025
CM రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్

TG: చీకటి ఒప్పందాలు చేసుకునే అవసరం BJPకి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. BRS, BJP కుమ్మక్కయ్యాయని CM రేవంత్ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. ‘మేము నీతి నిజాయితీతో బతికేవాళ్లం. మీలాగా కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగేవాళ్లం కాదు. మీలా పార్టీలు మారలేదు. దయ్యమన్న సోనియాను దేవత అంటూ వెళ్లి కాళ్లు పట్టుకోలేదు’ అని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును CBIకి అప్పగిస్తే విచారణ ముందుకు వెళ్తుందని అన్నారు.
Similar News
News February 25, 2025
మూడోరోజు.. ఇంకా లభించని ఆచూకీ

TG: SLBC టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకొని మూడురోజులు అవుతున్నా వారి ఆచూకీ లభించలేదు. అసలు వారు ప్రాణాలతో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టన్నెల్‌లో భారీగా ఊట నీరు వస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. బురద మరింత పేరుకుపోతోంది. లోపలికి వెళ్లాలని ప్రయత్నిస్తుండగా మట్టి పెళ్లలు విరిగిపడుతున్నాయి. ర్యాట్ హోల్ మైనర్స్ కూడా బురద లోంచి లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
News February 25, 2025
అది ఇండియాకు అడ్వాంటేజ్: కమిన్స్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ దుబాయ్‌లోని ఒకే స్టేడియంలో అన్నిమ్యాచ్‌లు ఆడుతుండటం జట్టుకు అడ్వాంటేజ్ అని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ కమిన్స్ అన్నారు. ఇప్పటికే టీమ్ ఇండియా బలంగా ఉందని, ఈ అంశం వారికి మరింత కలిసి వస్తోందని కమిన్స్ తెలిపారు. కాగా గాయం కారణంగా కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే.
News February 25, 2025
నేడు ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ రెండు బలమైన జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో మరో బిగ్ స్కోరింగ్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించే అవకాశం ఉంది. కాగా గ్రూప్-బిలోని ఈ రెండు జట్లు ఇప్పటివరకు చెరో మ్యాచ్ గెలిచాయి. నేటి గేమ్‌లో గెలిచే టీమ్ సెమీస్ స్థానాన్ని పదిలం చేసుకోనుంది.