News February 24, 2025

పురుష వైద్యులు మహిళా సిబ్బందికి రక్షణగా ఉండాలి: ప.బెంగాల్ సీఎం

image

వైద్య రంగంలో పనిచేస్తున్న పురుషులు తమతో పని చేసే మహిళా ఉద్యోగులకు రక్షణగా ఉండాలని ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. హెల్త్ కేర్ సెక్టార్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఆర్జీకర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన వైద్యురాలికి నివాళులు అర్పించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రూ.10,000-రూ.15,000 వరకు జీతాల పెంపును ప్రకటించారు.

Similar News

News February 25, 2025

నేడు ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా

image

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ రెండు బలమైన జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో మరో బిగ్ స్కోరింగ్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించే అవకాశం ఉంది. కాగా గ్రూప్-బిలోని ఈ రెండు జట్లు ఇప్పటివరకు చెరో మ్యాచ్ గెలిచాయి. నేటి గేమ్‌లో గెలిచే టీమ్ సెమీస్ స్థానాన్ని పదిలం చేసుకోనుంది.

News February 25, 2025

మోదీ చెప్పిన ఫూల్ మఖానా లాభాలివే..

image

ఏడాదిలో 300రోజులు ఫూల్ మఖానా తింటానని PM మోదీ <<15567735>>చెప్పారు<<>>. మరి ఆ సూపర్ ఫుడ్ తీసుకుంటే కలిగే లాభాలేంటో చూద్దామా?
* క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ ఉంటాయి.
* యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేసి, టైప్-2 డయాబెటిస్‌కు అడ్డుకట్ట వేస్తాయి.
* ఫైబర్ ఆకలిని తగ్గించి, బరువు పెరగకుండా చేస్తుంది.
* అమినో యాసిడ్స్ చర్మంపై మడతలు, మొటిమల్ని తగ్గిస్తాయి.

News February 25, 2025

చికిత్సకు సహకరిస్తున్న పోప్ ఫ్రాన్సిస్

image

పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమంగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందని వాటికన్ సిటీ తెలిసింది. ‘డబుల్ న్యూమోనియా’తో పాటు కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న పోప్ 11 రోజుల నుంచి రోమ్‌లోని గెమెల్లీ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. డబుల్ న్యూమోనియా వల్ల ఛాతీలో ఇన్‌ఫెక్షన్ సోకి ఆయన బ్రీతింగ్ తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో హై ఫ్లో ఆక్సిజన్ అందిస్తున్నారు.

error: Content is protected !!