News February 24, 2025
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు: చంద్రబాబు

AP: భవిష్యత్‌లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ‘ప్రభుత్వ కార్యాలయాలు, రైతు బజార్లలో క్యూఆర్ కోడ్ ఉంచాలి. అన్ని కలెక్టరేట్లలో వాట్సాప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి. నిత్యావసర సరుకుల ధరలు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. బెల్టు షాపులు ఎక్కడ ఉన్నా ఉపేక్షించొద్దు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 25, 2025
అది ఇండియాకు అడ్వాంటేజ్: కమిన్స్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ దుబాయ్‌లోని ఒకే స్టేడియంలో అన్నిమ్యాచ్‌లు ఆడుతుండటం జట్టుకు అడ్వాంటేజ్ అని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ కమిన్స్ అన్నారు. ఇప్పటికే టీమ్ ఇండియా బలంగా ఉందని, ఈ అంశం వారికి మరింత కలిసి వస్తోందని కమిన్స్ తెలిపారు. కాగా గాయం కారణంగా కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే.
News February 25, 2025
నేడు ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ రెండు బలమైన జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో మరో బిగ్ స్కోరింగ్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించే అవకాశం ఉంది. కాగా గ్రూప్-బిలోని ఈ రెండు జట్లు ఇప్పటివరకు చెరో మ్యాచ్ గెలిచాయి. నేటి గేమ్‌లో గెలిచే టీమ్ సెమీస్ స్థానాన్ని పదిలం చేసుకోనుంది.
News February 25, 2025
మోదీ చెప్పిన ఫూల్ మఖానా లాభాలివే..

ఏడాదిలో 300రోజులు ఫూల్ మఖానా తింటానని PM మోదీ <<15567735>>చెప్పారు<<>>. మరి ఆ సూపర్ ఫుడ్ తీసుకుంటే కలిగే లాభాలేంటో చూద్దామా?
* క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ ఉంటాయి.
* యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేసి, టైప్-2 డయాబెటిస్‌కు అడ్డుకట్ట వేస్తాయి.
* ఫైబర్ ఆకలిని తగ్గించి, బరువు పెరగకుండా చేస్తుంది.
* అమినో యాసిడ్స్ చర్మంపై మడతలు, మొటిమల్ని తగ్గిస్తాయి.