News February 25, 2025

WPL చరిత్రలో తొలి సూపర్ ఓవర్

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం నమోదైంది. బెంగళూరు, యూపీ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌‌కు దారి తీసింది. తొలుత RCB 180 రన్స్ చేసింది. ఛేదనలో యూపీ కూడా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టోర్నీ చరిత్రలో తొలిసారి సూపర్ ఓవర్ జరగనుంది.

Similar News

News February 25, 2025

గర్భిణులు, బాలింతలు జాగ్రత్త!

image

AP: ‘జనని సురక్ష యోజన’ పథకం ద్వారా సాయం చేస్తామని గర్భిణులు, బాలింతలకు ఫేక్ లింక్‌లు, మెసేజ్‌లు పంపి సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేస్తున్నారు. ఇలా కొందరు మోసపోతున్నట్లు బాపట్ల SP తుషార్ డూడీ వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం ఇచ్చారు. కేటుగాళ్లు తొలుత అంగన్వాడీ, ANMల వివరాలు సేకరించి ఆపై బాలింతలు, గర్భిణుల ఫోన్ నంబర్లు రాబడుతున్నారు. వాళ్ల వాట్సాప్ నంబరుకు CM ఫొటో పెట్టుకొని నమ్మిస్తూ మోసం చేస్తున్నారు.

News February 25, 2025

మూడోరోజు.. ఇంకా లభించని ఆచూకీ

image

TG: SLBC టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకొని మూడురోజులు అవుతున్నా వారి ఆచూకీ లభించలేదు. అసలు వారు ప్రాణాలతో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టన్నెల్‌లో భారీగా ఊట నీరు వస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. బురద మరింత పేరుకుపోతోంది. లోపలికి వెళ్లాలని ప్రయత్నిస్తుండగా మట్టి పెళ్లలు విరిగిపడుతున్నాయి. ర్యాట్ హోల్ మైనర్స్ కూడా బురద లోంచి లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

News February 25, 2025

అది ఇండియాకు అడ్వాంటేజ్: కమిన్స్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ దుబాయ్‌లోని ఒకే స్టేడియంలో అన్నిమ్యాచ్‌లు ఆడుతుండటం జట్టుకు అడ్వాంటేజ్ అని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ కమిన్స్ అన్నారు. ఇప్పటికే టీమ్ ఇండియా బలంగా ఉందని, ఈ అంశం వారికి మరింత కలిసి వస్తోందని కమిన్స్ తెలిపారు. కాగా గాయం కారణంగా కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే.

error: Content is protected !!