News February 25, 2025
సమన్వయకర్తలుగా పంచకర్ల, వంశీకృష్ణ యాదవ్

మార్చి 14వ తేదిన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్తలను నియమించింది. ఈ మేరకు విశాఖ పార్లమెంట్‌కు సంబందించి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్‌ను నియమించారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ ను అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. వీరు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి వేడుకలు విజయవంతానికి కృషి చేయాలి.
Similar News
News May 7, 2025
దివ్యాంగుల పూర్తి సమాచారం సేకరించాలని కలెక్టర్ ఆదేశాలు

దివ్యాంగుల సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ హరేంద్రప్రసాద్ శనివారం నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. దివ్యాంగుల చట్టాలు పక్కాగా అమలు జరగాలన్నారు. దివ్యాంగ బాలలను పాఠశాలలో చేర్పించాలని సూచించారు. 18 ఏళ్ల లోపు దివ్యాంగుల పెన్షన్ డేటాను సేకరించాలని ఆదేశించారు. జిల్లాలో దివ్యాంగుల పూర్తి సమాచారం సేకరించాలన్నారు. దివ్యాంగుల కోసం అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ర్యాంపులు నిర్మించాలని సూచించారు.
News May 7, 2025
సింహాచలం చందనోత్సవానికి 151 ప్రత్యేక బస్సులు

ఈనెల 30న సింహాచలంలో జరగనున్న చందనోత్సవానికి 151 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పల నాయుడు తెలిపారు. శనివారం ఆర్టీసీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. చందనోత్సవానికి కొండపైకి వెళ్లే బస్సులు కండిషన్లో ఉండేలా చూడాలని ఆదేశించారు. గోశాల నుంచి RTC కాంప్లెక్స్, పాత పోస్ట్ ఆఫీస్, RK బీచ్, కొత్తవలస, చోడవరం, అడవివరం, హనుమంతవాక, విజయనగరం నుంచి బస్సులు నడపనున్నారు.
News May 7, 2025
రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత: మంత్రి సత్య కుమార్

రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి తొలి ప్రాధాన్యత ఇస్తోందని ఆ శాఖ మంత్రి సత్య కుమార్ వెల్లడించారు. శనివారం ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిర్మించిన నూతన భవన ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.