News March 21, 2024
నెక్ట్స్ టార్గెట్ కేజ్రీవాల్?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇందులో ‘పెద్ద తలకాయలు’ ఉన్నాయంటూ మొదటినుంచీ అనుమానిస్తున్న ఈడీ.. ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది. ఇక నెక్ట్స్ టార్గెట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాలేనని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు పలుమార్లు నోటీసులు ఇచ్చిన ఈడీ త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.
Similar News
News December 28, 2024
డిసెంబర్ 30న అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 30వ తేదీన ప్రత్యేకంగా జరగనున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపేందుకు ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు సమాచారం అందించారు.
News December 28, 2024
వారికి నెలలోపే కొత్త పెన్షన్
AP: పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అదే నెలలోనే భార్యకు ప్రభుత్వం పెన్షన్ అందించనుంది. నవంబర్ 1 నుంచి ఈ నెల 15 మధ్య వితంతువులుగా మారిన 5,402 మందికి స్పౌజ్ కేటగిరీలో ఈ నెల 31న రూ.4వేల చొప్పున పంపిణీ చేయనుంది. అలాగే 3 నెలల వ్యవధిలో పింఛన్ తీసుకోలేని దాదాపు 50వేల మందికి 2, 3 నెలల మొత్తాన్ని ఒకేసారి అందివ్వనుంది. న్యూఇయర్ కానుకగా ఒకరోజు ముందే ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
News December 28, 2024
నిధుల బదిలీతో నాకు సంబంధం లేదు: కేటీఆర్
TG: ఫార్ములా-ఈ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని, విధానపరమైన అంశాలు చూసే బాధ్యత తనది కాదని పేర్కొన్నారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులపై అనుమతుల బాధ్యత సంబంధిత బ్యాంక్‌దేనని తెలిపారు. చెల్లింపుల విషయంలో అన్ని అంశాలను HMDAనే చూసుకోవాలన్నారు.