News February 25, 2025

NRPT: ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈనెల 24 నుంచి 29 వరకు జరిగే వారోత్సవాలను సందర్భంగా బ్యాంక్ అధికారులతో కలిసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ‘ఆర్థిక అక్షరాస్యత ఐశ్వర్యానికి బాట’ వివిధ రకాల సురక్షితమైన పొదుపు వర్గాలను ఎంచుకొని భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు తగ్గట్టు పొదుపు చేసుకోవాలన్నారు.

Similar News

News January 12, 2026

కోల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

కోల్ ఇండియా లిమిటెడ్‌(<>CIL<<>>)లో 125 ఇండస్ట్రీయల్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా మూడు రోజులే(JAN 15) సమయం ఉంది. ఉద్యోగాన్ని బట్టి CA/CMA ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ట వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.22వేలు స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.coalindia.in/

News January 12, 2026

పనసలో కాయకుళ్లు తెగులు లక్షణాలు

image

పనసలో కాయకుళ్లు తెగులు ప్రధానంగా బూజు తెగులు వల్ల వస్తుంది. ఇది పూత, పిందె దశలో మొదలై కాయకు వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశించడం వల్ల తొలుత మగ పువ్వులు, పూత, పిందెలు కుళ్లిపోతాయి. తర్వాత ఎదిగే కాయలు నల్లగా మారి కుళ్లిపోతాయి. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ తెగులు ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకుంటే దిగుబడి బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.

News January 12, 2026

MNCL: జాతరకు వేళాయె.. సౌకర్యాలు కరువాయే

image

సమ్మక్క సారలమ్మ జాతర వేడుకల గడువు సమీపిస్తున్నా జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు ఇంకా మొదలు కాలేదు. గోదావరి నది తీరంలో నిర్వహించే జాతరకు వారం క్రితం నిర్వహించిన వేలంపాటలో భారీగా దేవాదాయ శాఖకు ఆదాయం వచ్చింది. అయినప్పటికీ జాతర వద్ద ఏర్పాట్లు చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది. మరోవైపు జాతర కమిటీలో రాజకీయాలు చోటుచేసుకోవడం గమనార్హం. అధికారులు స్పందించి ఇప్పటికైనా ఏర్పాట్లు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.