News February 25, 2025
వికారాబాద్ జిల్లా.. సోమవారం నాటి ముఖ్యాంశాలు

√ వికారాబాద్: ప్రజావాణికి 109 ఫిర్యాదులు. √ పోలేపల్లి ఎల్లమ్మ, అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్న అసెంబ్లీ స్పీకర్. √ పారిశ్రామిక వాడ కోసం 93 ఎకరాల భూమి సేకరణ.. 62 మంది రైతులకు చెక్కులు అందజేసిన జిల్లా కలెక్టర్.√ కొడంగల్: చికెన్, కోడిగుడ్లు ఉచిత మేళాకు బారులు తీరిన జనం.√ 19వ విడత పీఎం కిషన్ నిధులు రైతు ఖాతాల్లో జమ.√ మర్పల్లి మండలంలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు.
Similar News
News September 18, 2025
కొత్తగూడెం: ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వినతి

జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని TTSF, GVS నాయకులు కోరారు. గురువారం డీఈఓకు వినతిపత్రం అందజేశారు. టీటీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మంగీలాల్, జీవీఎస్ కార్యదర్శి బాలాజీ నాయక్, జానకీరామ్ మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. విద్యా హక్కు చట్టాలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.
News September 18, 2025
కాణిపాకం ఆలయ చైర్మన్‌గా మణి నాయుడు

కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆలయ ఛైర్మన్‌గా వి.సురేంద్ర నాయుడు అలియాస్ మణి నాయుడును నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ ఆయన కాణిపాకం ఆలయ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. రెండోసారి బాధ్యతలను అప్పజెప్పడంతో సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News September 18, 2025
నిర్మల్: ‘ఈనెల 20న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం’

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఈనెల 20వ తేదీన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలను పాఠశాలలో నిర్వహించాలని జిల్లా విద్యాధికారి భోజన్న గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరయ్యేలా వారందరికీ ఆహ్వానం అందించాలని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించేలా సమావేశం నిర్వహించాలన్నారు.