News February 25, 2025

MDK: దేశానికి అన్నం పెట్టే రైతన్నలతో కన్నీళ్లు పెట్టిస్తున్నారు: హరీశ్ రావు

image

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే.. నేడు జగిత్యాలలో రైతులు పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని రైతుల కన్నీళ్ల కడగండ్లను కాంగ్రెస్‌ సర్కార్‌ పునరావృతం చేస్తున్నదని మండిపడ్డారు.

Similar News

News January 16, 2026

మంచిర్యాల: పండగ పూట విషాదం

image

పండుగ పూట మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెన్నూరు మండలంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానిక పెట్రోల్ బంక్ ఏరియా శనగకుంట ప్రాంత సమీపంలో రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలై మరణించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 16, 2026

సారంగాపూర్: ఉరివేసుకొని యువకుడి మృతి

image

సారంగాపూర్ గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ రఫీ(26) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మహమ్మద్ రఫీ తాగుడుకు బానిసై మద్యం మత్తులో బుధవారం ఇంటిలో దూలానికి ఉరివేసుకుని మృతి చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి తల్లి షేక్ బిస్మిల్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ పేర్కొన్నారు.

News January 16, 2026

నితీశ్‌పై తీవ్ర విమర్శలు.. తిప్పికొట్టిన విహారి

image

భారత జట్టుకు ఆల్‌రౌండర్‌గా పనికిరాడంటూ నితీశ్ రెడ్డిపై వస్తున్న విమర్శలపై హనుమ విహారి Xలో స్పందించారు. ’22 ఏళ్ల వయసులో బ్యాటింగ్, పేస్ బౌలింగ్ చేసే క్రికెటర్లు దేశంలో ఎవరైనా ఉన్నారా? నితీశ్ ఇప్పటివరకు 3 వన్డేల్లో 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. 4 T20ల్లో 3W, 4th సీమర్‌గా 10 టెస్టుల్లో 8W పడగొట్టాడు. మెల్బోర్న్‌లో సెంచరీ చేశాడు. అది ఇప్పటికీ చాలా మందికి నెరవేరని కల’ అంటూ నితీశ్‌కు మద్దతునిచ్చారు.