News February 25, 2025
RJY: ఆదర్శ యోజన నిధులను సద్వినియోగం చేసుకోవాలి

పీఎం ఆదర్శ యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతిపాదిత పనులు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో మార్చి 31 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పీఎం ఆదర్శ యోజన పనుల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదర్శ యోజన నిధులను సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Similar News
News February 24, 2025
రాజమండ్రి: కేంద్ర బడ్జెట్‌పై మేధావుల సమావేశంలో పాల్గొన్న ఎంపీ

కేంద్ర బడ్జెట్ 2025 మేధావుల సమావేశం రాజమండ్రిలో ఓ ఫంక్షన్ హాల్ వద్ద ఎంపీ పురందీశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి మాట్లాడారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగేంద్ర, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
News February 23, 2025
తూ.గో. జిల్లా TODAY TOP NEWS

➤ రాజమండ్రి: రేపు PGRS రద్దు ➤ గోకవరం: ఉచితంగా చికెన్, గుడ్లు పంపిణీ ➤ అనపర్తి: నల్లమిల్లి ఇంటికి మంత్రులు, ఎమ్మెల్యేలు ➤ రాజమండ్రి: చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు ➤ బిక్కవోలులో ఘనంగా సత్తెమ్మ తల్లి జాతర ➤ రాజమండ్రి: పార్లమెంటు పరిధిలో పర్యటించిన ఎంపీ ➤ దేవరపల్లి: చికెన్ షాపులు స్వచ్ఛందంగా మూసివేత ➤ రాజమండ్రి: ‘MLC అభ్యర్థి రాజశేఖర్‌ని గెలిపించండి’
News February 23, 2025
RJY: నేడు గ్రూప్-2 పరీక్ష..పావుగంట ముందే గేట్ క్లోజ్

రాష్ట్ర వ్యాప్తంగా నేడు గ్రూప్ -2 పరీక్ష జరగనుంది. ఉదయం 10.గ నుంచి 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 3.గ నుంచి 5.30 వరకు పేపర్-2 నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్ష ప్రారంభానికి గంటాన్నర ముందుగానే ప్రధాన గేట్లును మూసివేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. పరీక్ష కేంద్రాల వద్ద బీసీఆర్‌పీసీ సెక్షన్ 163 అమల్లో ఉంటుందన్నారు. షెడ్యూలు ప్రకారమే పరీక్షలు జరుగుతాయని ఎపీపీఎస్సీ బోర్డు తెలిపింది.