News February 25, 2025

గంజాయి నిర్మూలనకు కృషి చేయండి: కలెక్టర్

image

అల్లూరి జిల్లాలో గంజాయి నిర్మూలనకు సంబంధిత శాఖలన్నీ కలసి కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎన్కార్డ్ (NCORD) సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖ ద్వారా డ్రోన్ల సహాయంతో 274 గ్రామాలు పరిశీలించి, సుమారు 82 ఎకరాలలో గంజాయి సాగును గుర్తించడం జరిగిందన్నారు. ఆయా రైతులను గుర్తించి వారికి గంజాయి వల్ల కలిగే నష్టాలు, దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News February 25, 2025

విశాఖ నుంచి షాలిమార్‌కు వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్

image

ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు విశాఖ- షాలిమార్‌కు(08508/07) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈ రైలు మార్చి 11 నుంచి ఏప్రిల్ 29వరకు ప్రతి మంగళవారం నడవనుంది. మంగళవారం విశాఖలో బయలుదేరి బుధవారం షాలిమార్ చేరుకుంటుంది. మళ్లీ బుధవారం షాలిమార్ నుంచి బయలుదేరి గురువారం విశాఖ చేరుతుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News February 25, 2025

రామప్పకు మినీ హాఫ్ డే టూర్.. ఏసీ కోచ్‌లో జర్నీ

image

మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ – హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి రామప్ప ఆలయం వరకు 18 సీట్ల ఏసీ మినీ కోచ్ హాఫ్ డే టూర్లను నిర్వహిస్తున్నట్లు టీజీటీడీసీ డిప్యూటీ మేనేజర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6.45 గంటల వరకు ఉంటుందన్నారు.

News February 25, 2025

కోల్‌కతా, భువనేశ్వర్ సమీపంలో భూకంపం

image

కోల్‌కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 5.1గా భూకంప తీవ్రత నమోదైంది. కోల్‌కతాతో పాటు పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఒడిశాకు 175కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించగా, దీని ప్రభావం బంగ్లాదేశ్‌లోనూ కనిపించింది.

error: Content is protected !!