News February 25, 2025
కొత్తగూడెం: సత్వర చర్యలు తీసుకోండి: అదనపు కలెక్టర్లు

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.
Similar News
News February 25, 2025
నెల్లూరు ఐటీడీఏ పీవోగా మల్లికార్జున్ రెడ్డి

నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా మల్లికార్జున్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా కొండాయపాలెం గేటు వద్ద ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కొంతకాలంగా ఆ స్థానం ఖాళీగా ఉండడంతో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి PBN పరిమళ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వహించారు. ఎట్టకేలకు ప్రభుత్వం రెగ్యులర్ POను నియమించడంతో ఆ స్థానం భర్తీ అయ్యింది. ఈ మేరకు మల్లికార్జున్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
News February 25, 2025
విశాఖ నుంచి షాలిమార్‌కు వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్

ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు విశాఖ- షాలిమార్‌కు(08508/07) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈ రైలు మార్చి 11 నుంచి ఏప్రిల్ 29వరకు ప్రతి మంగళవారం నడవనుంది. మంగళవారం విశాఖలో బయలుదేరి బుధవారం షాలిమార్ చేరుకుంటుంది. మళ్లీ బుధవారం షాలిమార్ నుంచి బయలుదేరి గురువారం విశాఖ చేరుతుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 25, 2025
రామప్పకు మినీ హాఫ్ డే టూర్.. ఏసీ కోచ్‌లో జర్నీ

మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ – హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి రామప్ప ఆలయం వరకు 18 సీట్ల ఏసీ మినీ కోచ్ హాఫ్ డే టూర్లను నిర్వహిస్తున్నట్లు టీజీటీడీసీ డిప్యూటీ మేనేజర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6.45 గంటల వరకు ఉంటుందన్నారు.