News February 25, 2025
ఖమ్మం: సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెనుబల్లి మండలం టేకులపల్లిలో సోమవారం రైతులతో సమావేశమై సాగు నీటి విడుదల షెడ్యూల్‌పై ముందుగా సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. టెయిల్ ఎండ్ ప్రాంతాలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రామంలో తాగునీటి సరఫరా, విద్య, వైద్యం అంశాలను పరిశీలించారు. అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News February 25, 2025
ఖమ్మం: మిరప ధర పతనం.. రైతుల దిగాలు!

ఉమ్మడి జిల్లాలో మిర్చికి మద్దతు ధర లభించక రైతుల కంట కన్నీరు ఉబికివస్తోంది. గతేడాది రూ.20వేలు ఉన్న ధర ఈయేడు రూ.14వేలకు పడిపోయింది. ఈసారి తెగుళ్లకు తోడు కూలీల ధరలతో రైతులు దిగాలు చెందుతున్నారు. ధరలు పడిపోతుండటంతో పోయిన యేడు 1.50 లక్షలకు ఉన్న మిర్చి సాగు ఈసారి 95 వేలకు తగ్గింది. జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేసి రూ.25వేల మద్దతు చెల్లించాలని జిల్లా రైతాంగం కోరుతోంది.
News February 25, 2025
ఖమ్మం: మందు బాబులకు షాక్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం విక్రయాలు రెండు రోజుల పాటు నిలిపివేయనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఫిబ్రవరి 25 సాయంత్రం 4 గంటల నుంచి ఫిబ్రవరి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్‌లు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 25, 2025
తీర్థాల జాతరకు వచ్చే భక్తులకు ఖమ్మం కమిషనర్ సూచనలు

> ఖమ్మం పట్టణం వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు దానవాయిగూడెం, రామన్నపేట, కామంచికల్ మీదుగా వచ్చి కామంచికల్ మున్నేరు వాగు బ్రిడ్జ్ రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్ చేయాలి.> ఇక ట్రాక్టర్లు, లారీలు కామంచికల్, పటివారిగూడెం నుంచి జాన్బాద్ తండా వెళ్లే దారిలోని కామంచికల్ బ్రిడ్జి దగ్గర పార్కింగ్ చేయాలి.