News February 25, 2025
హనుమకొండ: వైన్స్, బార్, రెస్టారెంట్లు బంద్: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈ నెల 25 నుంచి 27 వరకు హనుమకొండ జిల్లాలోని అన్ని మద్యం షాపులు, బార్, రెస్టారెంట్లు, కల్లు డిపోలు మూసి వేస్తున్నామని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News February 25, 2025
టెక్కలి: దూరవిద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య ద్వారా అందిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల్లో 2025 ఏడాదికి గాను దరఖాస్తులు కోరుతున్నట్లు నౌపడ ఆర్ ఎస్ సమీపంలోని దూరవిద్య కేంద్రం డైరెక్టర్ చంద్రశేఖర్ ఆజాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులతో పాటు ఎంఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంబీఏ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దూరవిద్య కేంద్రంలో సంప్రదించాలని కోరారు.
News February 25, 2025
ప్రకాశం: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష

2025-26 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో చేరటానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా డీఈఓ కిరణ్ సోమవారం తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి, 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో చేరటానికి ఆసక్తి కనబరిచే విద్యార్థులు ఆన్లైన్‌లో మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
News February 25, 2025
CM చిత్తూరు జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే..

సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఖరారైంది. మార్చి 1న ఆయన జీడీనెల్లూరుకు రానున్నారు. శనివారం 11.25కి రేణిగుంటకు వస్తారు. 11.50కి హెలికాప్టర్ ద్వారా జీడీనెల్లూరుకు వెళ్తారు. అక్కడ పింఛన్లు పంపిణీ చేస్తారు. తర్వాత గ్రామస్థులతో మాట్లాడతారు. 2.30 తర్వాత తిరిగి రేణిగుంట వెళ్తారు. ఈనేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.