News February 25, 2025
మంచిర్యాల: సింగరేణి కార్మికులకు 2 గంటలు పర్మిషన్

ఈ నెల 27న జరగనున్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన సింగరేణి ఉద్యోగులకు విధుల్లో నుంచి 2 గంటలు మినహాయింపు ఇస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలో అర్హులైన పట్టభద్రులు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.
Similar News
News February 25, 2025
టెన్త్ మార్కులు ఎలా ఇద్దాం?.. విద్యాశాఖ కసరత్తు

TG: ఈ ఏడాది నుంచి టెన్త్ మార్కుల విధానం మారనుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివేయగా ఆ స్థానంలో దేన్ని అమలు చేయాలనే దానిపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్కులను బట్టి పాస్, ఫెయిల్ అని ఇవ్వాలా? లేక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కేటగిరీలుగా ఇవ్వాలా? అని నిన్నటి సమావేశంలో చర్చించారు. అయితే ఎటూ క్లారిటీ రాకపోవడంతో త్వరలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.
News February 25, 2025
కర్నూలు జిల్లాలో పింఛన్లకు రూ.103.33 కోట్లు

కర్నూలు జిల్లాలో మార్చి నెల పింఛన్ పంపిణీకి నిధులు మంజూరయ్యాయి. 2,38,798 మందికి రూ.103.33 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని ఆయా సచివాలయాల సిబ్బంది ఈ నెల 28లోపు విత్ డ్రా చేసుకోవాలని సూచించింది. మార్చి 1న ఉదయం 6 గంటల నుంచే గ్రామ, పట్టణాల్లో లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది పింఛన్ మొత్తం అందజేయనున్నారు.
News February 25, 2025
అకౌంట్లలో డబ్బులు.. సీఎం కీలక ప్రకటన

TG: మార్చి 31లోపు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటివరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు నిధులు జమ చేసింది. ఇకపై మిగతావారికీ అందజేస్తామని సీఎం వెల్లడించారు. కాగా తొలుత ఎకరం వరకు ఉన్న 17 లక్షల మందికి రూ.557.54Cr, రెండెకరాల వరకు ఉన్న 13.23 లక్షల మందికి రూ.1130.29Cr, మూడెకరాల వరకు ఉన్న 9.56 లక్షల మందికి రూ.1230.98Cr ఖాతాల్లో వేశారు.