News February 25, 2025

ఈ సింగర్ ఇద్దరు స్టార్ హీరోల చెల్లెలు తెలుసా?

image

సింగర్ బృంద.. తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తీల సొంత చెల్లెలు. మిస్టర్ చంద్రమౌళి మూవీతో సింగర్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె తర్వాత రాక్షసి, జాక్‌పాట్, పొన్‌మగల్ వంధాల్‌, ఓ2లో పాటలు పాడారు. తన వదిన, సూర్య భార్య జ్యోతిక నటించిన పొన్‌మగల్ వంధాల్‌లో బృంద పాడిన ‘వా చెల్లామ్’ సాంగ్ పెద్ద హిట్టయింది. ఇక రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ తమిళ వెర్షన్‌లో ఆలియాకు ఈమే డబ్బింగ్ చెప్పారు.

Similar News

News February 25, 2025

టాయిలెట్‌కు మొబైల్ తీసుకెళ్తున్నారా?

image

టాయిలెట్‌లోకి మొబైల్ తీసుకెళ్లి గంటల కొద్దీ మాట్లాడటం, రీల్స్ చూడటం కొందరికి అలవాటుగా మారింది. అయితే కమోడ్‌పై ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మలద్వారంపై ఒత్తిడి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల నొప్పితో కూడిన ఇన్‌ఫ్లమేషన్, మొలలు, తీవ్ర కేసుల్లో యానల్ ఫిస్టులాలు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు. చిరుతిళ్లు ఎక్కువగా తినడం, సరిపడిన నీరు తాగకపోవడమూ దీనికి కారణమవుతున్నట్లు పేర్కొంటున్నారు.

News February 25, 2025

స్వయం ఉపాధికి రాయితీ రుణాల మంజూరు

image

AP: క్రైస్తవ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాలకు రుణ రాయితీ కింద రూ.2.43కోట్లను విడుదల చేసినట్లు మంత్రి NMD ఫరూక్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ కార్పొరేషన్ ద్వారా రూ.4.86కోట్ల స్వయం ఉపాధి ప్రణాళిక అమలుకు నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగానే రూ.2.43కోట్లు రాయితీ కింద ఇస్తుండగా, మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణ రూపంలో పంపిణీ చేయనున్నట్లు మంత్రి వివరించారు.

News February 25, 2025

కోల్‌కతా, భువనేశ్వర్ సమీపంలో భూకంపం

image

కోల్‌కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 5.1గా భూకంప తీవ్రత నమోదైంది. కోల్‌కతాతో పాటు పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఒడిశాకు 175కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించగా, దీని ప్రభావం బంగ్లాదేశ్‌లోనూ కనిపించింది.

error: Content is protected !!