News February 25, 2025
BHPL: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై సమీక్ష

పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై విద్యా, విద్యుత్, వైద్య, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9: 30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని వివరించారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News February 25, 2025
విశాఖలో ఆధార్ కార్డు లేని చిన్నారులు 3,200 మంది

విశాఖలో వార్డు సచివాలయాల్లో, కామన్ సర్వీస్ సెంటర్‌లో, పోస్ట్ ఆఫీస్‌లో ఈనెల 28 వరకు ఆధార్ సెంటర్‌లు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హరేంధీర ప్రసాద్ సోమవారం తెలిపారు. జిల్లాలో 3,200కు పైగా పిల్లలు బర్త్ సర్టిఫికెట్ ఉండి కూడా బాలాధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోలేదన్నారు. వారందరూ ఈఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకునేలా అంగన్వాడి కేంద్రాల సూపర్‌వైజర్స్ వారి తల్లిదండ్రులకు వివరించాలని ఆదేశించారు.
News February 25, 2025
పెద్దపల్లి: సింగరేణి కార్మికులకు 2 గంటలు పర్మిషన్

ఈ నెల 27న జరగనున్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన సింగరేణి ఉద్యోగులకు విధుల్లో నుంచి 2 గంటలు మినహాయింపు ఇస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం, గోదావరిఖని, మంథని, రామగిరి, 8ఇంక్లైన్ కాలనీ ఏరియాల్లో అర్హులైన పట్టభద్రులు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.
News February 25, 2025
గోల్కొండ, చార్మినార్‌కు టూరిస్టుల ఓటు

TG: దేశంలో అత్యధిక మంది సందర్శించిన చారిత్రక ప్రదేశాల్లో గోల్కొండ 6, చార్మినార్ 9వ స్థానాల్లో నిలిచాయి. 2022-24కు గానూ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో టాప్-3లో తాజ్ మహల్, కోణార్క్‌లోని సూర్య దేవాలయం, ఢిల్లీలోని కుతుబ్ మినార్ ఉన్నాయి. ఇక 2019 తర్వాత హైదరాబాద్‌కు సందర్శకుల తాకిడి 30 శాతం పెరిగినట్లు సర్వే వెల్లడించింది.