News February 25, 2025

నల్గొండ: ఇంటర్, పది పరీక్షల నిర్వహణపై సమీక్ష

image

మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.  సోమవారం ఆయన తన చాంబర్లో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ,మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని ఆయన తెలిపారు.

Similar News

News September 13, 2025

నకిరేకల్: విద్యార్థినికి వేధింపులు.. టీచర్ సస్పెండ్..!

image

నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్న మామిడి శ్రీనివాస్‌పై <<17696456>>లైంగిక వేధింపుల <<>>ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారి విచారణ జరిపి నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి పంపించారు. నివేదిక అందిన వెంటనే సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

News September 13, 2025

సత్తా చాటిన నల్గొండ పోలీస్

image

హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో మూడు రోజులపాటు నిర్వహించిన 7వ ఆల్ ఇండియా జైళ్ల శాఖ క్రీడల్లో 24 రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఈ క్రీడల్లో నల్గొండ జిల్లా జైలు పోలీస్ మామిడి చరణ్ 80 కిలోల విభాగంలో కరాటే పోటీల్లో స్వర్ణ పతకం సాధించి తెలంగాణకు గౌరవం తీసుకొచ్చాడు. ఈ విజయంపై జైలు అధికారులు, పోలీసులు శ్రావణ్, గణేష్, సైదులు, రాంబాబు అభినందనలు తెలిపారు.

News September 13, 2025

నల్గొండ: ఆర్టీసీకి రూ.32.59 లక్షల ఆదాయం

image

నల్గొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుంచి వివిధ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా నాలుగు నెలల్లో రూ.32.59 లక్షల ఆదాయం సమకూరిందని ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. జూన్‌లో 22 బస్సులతో రూ. 11.95 లక్షలు, జూలైలో 22 బస్సులతో రూ. 13 లక్షలు, ఆగస్టులో 18 బస్సులతో రూ. 6.47 లక్షలు, సెప్టెంబర్‌లో 3 బస్సులతో రూ. 1.16 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆయన వివరించారు.