News February 25, 2025

కామారెడ్డి: శీనన్న కష్టపడి పని చేయండి: CM

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం నిజామాబాద్‌కు సీఎంను ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు చర్చించుకున్నారు. సీఎం రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీపై ఎంతైనా ఉందని చెప్పారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని సూచించారన్నారని తెలిపారు. 

Similar News

News February 27, 2026

విజయవాడలో ప్రియుడిని పట్టింటిన గర్ల్‌ఫ్రెండ్ ఫోన్‌కాల్..!

image

పోలీసుల కళ్లు కప్పి పరారైన నిందితుడిని ఎట్టకేలకు మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్‌లో డ్రగ్స్ తీసుకుంటున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిందితుడు రాజేష్ పోలీసుల నుంచి పరారయ్యాడు. రాజేష్‌కు గర్ల్ ఫ్రెండ్ ఉండగా ఆమెతో వేరే వారి ఫోన్ నుంచి నిందితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడుతుండగా సాంకేతిక పరిజ్ఞానంతో అతణ్ని అదుపులోకి తీసుకొని గురువారం రిమాండ్‌కు తరలించారు.

News February 27, 2026

DRDOలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

image

<>DRDO<<>>కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ స్టడీస్ అండ్ అనాలసిస్(ISSA)21 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BE/BTech(CS), డిప్లొమా(CS), MSc(మ్యాథ్స్) అర్హతగల వారు దరఖాస్తును, డాక్యుమెంట్స్‌ను hrd.issa@gov.inకు ఈ మెయిల్ చేయాలి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News February 27, 2026

రూ. 250 కోట్ల భూమి.. సర్కారు నిర్ణయం ఏమిటో?

image

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత అనంతరం.. స్వాధీనం చేసుకున్న 31.07 ఎకరాల వినియోగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ భూమి విలువ సుమారు రూ. 250 కోట్లు ఉంటుందని కలెక్టరే ప్రకటించడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఖరీదైన ఈ భూముల్లో సామాన్యులకు ఉపయోగపడేలా ప్రభుత్వ భవనాలు లేదా ప్రజా ప్రయోజన నిర్మాణాలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.