News February 25, 2025

మహిళా కాంగ్రెస్ సభ్యత్వాల్లో భద్రాద్రి జిల్లాకు 4వ స్థానం

image

గాంధీభవన్లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన జరిగిన నారి న్యాయ సమ్మేళన్ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పాల్గొన్నారు. తెలంగాణలో లక్ష సభ్యత్వాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ హాజరయ్యారన్నారు. మహిళా కాంగ్రెస్ సభ్యత్వాల్లో జిల్లాకు 4వ స్థానం దక్కిందన్నారు.

Similar News

News February 25, 2025

HYD: పబ్‌లో యువతిపై ఎక్స్ లవర్ దాడి

image

జూబ్లీహిల్స్‌లోని ఇల్యూజన్ పబ్‌లో ఓ యువకుడు యువతిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పాతబస్తీకి చెందిన యువతి తన స్నేహితులతో కలిసి పబ్‌కు వచ్చింది. ఆ సమయంలో మాజీ ప్రియుడు ఆసిఫ్ జానీ అక్కడికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశాడు. అడ్డుకునేందుకు యత్నించిన స్నేహితురాలిపై కూడా దాడి చేయడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

News February 25, 2025

కామారెడ్డి: మార్చి 8న లోక్ అదాలత్

image

మార్చ్ 8న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయమూర్తి టి.నాగరాణి తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి బ్యాంకు అధికారులతో న్యాయమూర్తి సమావేశమై, మాట్లాడారు. వీలైనంత వరకు ఎక్కువ మొత్తంలో బ్యాంకు కేసులను పరిష్కరించడానికి సహకరించాలని అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.

News February 25, 2025

HYD: ఉష్ణోగ్రతలు పెరుగుతాయి జాగ్రత్త: కలెక్టర్

image

వేసవిలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని HYD కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి జాగ్రత్తలు చెప్పారు. కలెక్టరేట్‌లో ఎండల తీవ్రత, జాగ్రత్త చర్యలపై జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు.

error: Content is protected !!