News February 25, 2025
నేడు ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ రెండు బలమైన జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో మరో బిగ్ స్కోరింగ్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించే అవకాశం ఉంది. కాగా గ్రూప్-బిలోని ఈ రెండు జట్లు ఇప్పటివరకు చెరో మ్యాచ్ గెలిచాయి. నేటి గేమ్‌లో గెలిచే టీమ్ సెమీస్ స్థానాన్ని పదిలం చేసుకోనుంది.
Similar News
News February 25, 2025
ఏనుగుల దాడి ఘటనపై స్పందించిన పవన్

AP: అన్నమయ్య జిల్లాలో భక్తులపై <<15571904>>ఏనుగుల దాడి ఘటనపై<<>> డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్‌ను అసెంబ్లీ నుంచి హుటాహుటిన వై.కోట వెళ్లాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించాలని సూచించారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మరోవైపు ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
News February 25, 2025
భర్తని మిస్ అవుతున్నా: టాలీవుడ్ హీరోయిన్

షూటింగ్ సమయంలో తన భర్త జాకీ భగ్నానీని మిస్ అవుతున్నట్లు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. జాకీతో ఉన్నాననే ఫీల్ రావడం కోసం ఆయన దుస్తులు వేసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు ఈ బ్యూటీ దూరమవ్వగా బాలీవుడ్‌లో వరుసగా మూవీస్ చేస్తున్నారు. ఆమె నటించిన ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలైంది.
News February 25, 2025
టెన్త్ మార్కులు ఎలా ఇద్దాం?.. విద్యాశాఖ కసరత్తు

TG: ఈ ఏడాది నుంచి టెన్త్ మార్కుల విధానం మారనుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివేయగా ఆ స్థానంలో దేన్ని అమలు చేయాలనే దానిపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్కులను బట్టి పాస్, ఫెయిల్ అని ఇవ్వాలా? లేక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కేటగిరీలుగా ఇవ్వాలా? అని నిన్నటి సమావేశంలో చర్చించారు. అయితే ఎటూ క్లారిటీ రాకపోవడంతో త్వరలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.