News February 25, 2025
అది ఇండియాకు అడ్వాంటేజ్: కమిన్స్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ దుబాయ్‌లోని ఒకే స్టేడియంలో అన్నిమ్యాచ్‌లు ఆడుతుండటం జట్టుకు అడ్వాంటేజ్ అని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ కమిన్స్ అన్నారు. ఇప్పటికే టీమ్ ఇండియా బలంగా ఉందని, ఈ అంశం వారికి మరింత కలిసి వస్తోందని కమిన్స్ తెలిపారు. కాగా గాయం కారణంగా కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే.
Similar News
News February 25, 2025
ప్రభుత్వ ఉద్యోగులకు మస్క్ వార్నింగ్.. ట్రంప్ మద్దతు

అమెరికాలోని ప్రభుత్వ ఉద్యోగులకు డోజ్ చీఫ్ మస్క్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత వారం చేసిన పనులను రెండు రోజుల్లో చెప్పాలని, లేకపోతే రిజైన్ చేయాలని ఎక్స్‌లో పోస్టు పెట్టగా దాన్ని పట్టించుకోవద్దని ట్రంప్ యంత్రాంగం భరోసానిచ్చింది. అయితే మస్క్ వ్యాఖ్యలకు అధ్యక్షుడు ట్రంప్ మద్దతిచ్చారు. ఉద్యోగులు చేస్తున్న పని గురించి మస్క్ ప్రశ్నిస్తున్నారని, దానికి సమాధానం ఇవ్వాలని వారికి సూచించారు.
News February 25, 2025
ఏనుగుల దాడి.. మృతులకు రూ.10 లక్షల పరిహారం

AP: అన్నమయ్య జిల్లాలో భక్తులపై <<15571904>>ఏనుగుల దాడి<<>> ఘటనలో మృతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అనౌన్స్ చేశారు. క్షతగాత్రుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
News February 25, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్

నిన్న నష్టాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్ ఇవాళ పుంజుకుంటోంది. సెన్సెక్స్ 117 పాయింట్లు పెరిగి 74,571 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 22,584 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్ లాభాల్లో కొనసాగుతుండగా సన్ ఫార్మా, హిందాల్కో, కోల్ ఇండియా, లార్సెన్ నష్టాల్లో ఉన్నాయి.