News February 25, 2025
గంజాయి కేసులో పదేళ్ల జైలు శిక్ష: ఎస్పీ

గంజాయి కేసులో ముద్దాయిలకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ అనకాపల్లి 10వ అదనపు జిల్లా కోర్టు తీర్పును ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. 2021 మే 20వ తేదీన అనకాపల్లి టౌన్ పరిధిలో 20 కేజీల గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కోర్టు సోమవారం శిక్షను విధించిందని ఎస్పీ తెలిపారు.
Similar News
News November 6, 2025
రేషన్ షాపుల్లో రూ.18కే గోధుమ పిండి: నాదెండ్ల

AP: జనవరి 1 నుంచి పట్టణాల్లోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘2400 మెట్రిక్ టన్నులు సిద్ధం చేస్తున్నాం. కిలో రూ.18 చొప్పున రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తాం. నవంబర్‌లో వర్ష సూచన నేపథ్యంలో కౌలు రైతులకు ఉచితంగా 50 వేల టార్పాలిన్లు ఇస్తాం. ధాన్యం అమ్మిన రైతులకు అదే రోజు ఖాతాల్లో డబ్బు జమయ్యేలా ఏర్పాట్లు చేశాం. సెలవుంటే తర్వాత రోజు పడతాయి’ అని తెలిపారు.
News November 6, 2025
హన్వాడ: జాతర ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

కురుమూర్తి జాతరకు వెళ్లడానికి ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వలేదని విజయ్ (15) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన సల్లోనిపల్లిలో చోటుచేసుకుంది. పొలం పనులు ఉన్నాయని ఇంట్లో వారు చెప్పడంతో క్షణికావేశంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. శ్రీనివాసులు కుమారుడైన విజయ్ స్నేహితులతో జాతరకు వెళ్లాలనుకున్నాడని గ్రామస్థులు తెలిపారు.
News November 6, 2025
తడిసిన ధాన్యం కొంటాం: ఢిల్లీరావు

AP: 17% వరకు తేమ ఉన్న ధాన్యాన్నీ కొంటామని సివిల్ సప్లై కార్పొరేషన్ MD ఢిల్లీరావు రైతులకు హామీ ఇచ్చారు. వివిధ రైతు సంఘాల నేతలు ఆయన్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మద్దతు ధరకు అదనంగా గోనె సంచులు, రవాణా ఖర్చులివ్వాలని రైతులు కోరారు. మిల్లర్ల యాజమాన్యాల నుంచి వేధింపులను అడ్డుకోవాలన్నారు. పంటనష్ట పరిహారం, ధాన్యం కొనుగోలు, తేమశాతం అంచనాపై సమస్యలుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఢిల్లీరావు రైతులకు తెలిపారు.


