News February 25, 2025
ఏలూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్లు ఎందరంటే?

ఈ నెల 27న ఉదయం 8 గం. నుంచి సాయంత్రం 4 గం.వరకు జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో ఉమ్మడి ఉభయ గోదావరిలో 3,14,984 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. 456 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఏలూరు జిల్లాలో 42,282 మంది ఓటర్లు ఉన్నారని, 66 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. మంగళవారం సాయంత్రం 4.గంటల అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగుస్తుందన్నారు.
Similar News
News February 25, 2025
హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సినవి!

* మీరు ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తి అయినప్పటికీ, వినయంగా ఉండండి
* ఇతరుల సంక్షేమం కోసం మీ అధికారాలను ఉపయోగించండి
* ఇంద్రియాలను మీరు నియంత్రించాలి. అవి మిమ్మల్ని నియంత్రించకూడదు
* పాపాలు చేసే వారి పట్ల దయ చూపొద్దు
* నిర్భయంగా, నమ్మకంగా ఉండండి
* క్రమం తప్పకుండా శారీరక & మానసిక బలాన్ని మెరుగుపరుచుకోండి
News February 25, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,920గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో మార్పు లేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.20 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
News February 25, 2025
28న తిరుపతిలో జాబ్ మేళా

APSSDC ఆధ్వర్యంలో తిరుపతిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(NAC)లో ఈనెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. 2 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. నిరుద్యోగ అభ్యర్థుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.