News February 25, 2025

30ఏళ్ల తర్వాత CMతో మాజీ మంత్రి దగ్గుబాటి భేటీ.!

image

కొన్ని కలయికలు ఆసక్తి కలిగిస్తాయనడానికి సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఓ ఉదాహరణ. దాదాపు 30 ఏళ్ల తర్వాత CM చంద్రబాబును ఉండవల్లి నివాసంలో ఆయన తోడల్లుడు, మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలిశారు. తాను రాసిన “ప్రపంచ చరిత్ర” (ఆది నుంచి నేటి వరకు) పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గురించి మాట్లాడేందుకు డా.దగ్గుబాటి CM ఇంటికి వెళ్లారు. ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహణపై చర్చించి CMను ఆహ్వానించారు.

Similar News

News September 19, 2025

‘చలో మెడికల్ కాలేజీ’.. వైసీపీ ఆందోళనలు

image

AP: మెడికల్ కాలేజీల PPP విధానంపై వైసీపీ ‘చలో మెడికల్ కాలేజీ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు కొందరు ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేశారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం అని నేతలు విమర్శించారు. ప్రైవేటీకరణను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు #SaveMedicalCollegesInAP అంటూ వైసీపీ ట్వీట్లు చేస్తోంది.

News September 19, 2025

డయేరియా బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్

image

డయేరియాపై ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. బుధవారం 33 మంది డయేరియా లక్షణాలతో జీజీహెచ్‌లో చేరారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. రోగులు కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధి ప్రబలిందని వైద్యుల ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు. తాగునీటి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపుతున్నామన్నారు.

News September 19, 2025

కడప: పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్లు..!

image

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎర్రచందనం కూలీలను కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు అదుపులోకి తీసుకునట్లు తెలుస్తోంది. మండలంలోని పెద్ద శెట్టిపల్లి వద్ద ఎర్రచందనం తరలించేందుకు వెళ్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. 15 మంది కూలీలను అదుపులోకి తీసుకుంటూ సమాచారం. వీరి వెనుక ఉన్న ప్రధాన స్మగ్లర్ ఎవరనే దానిపై కడపకు తరలించి విచారిస్తున్నట్టు తెలుస్తోంది.