News February 25, 2025
నలుగురు అన్నదాతల ఆత్మహత్య

TG: అప్పుల బాధతో గత 2 రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. యాదాద్రి(D) వీరారెడ్డిపల్లికి చెందిన రాంచంద్రయ్య పత్తి సాగు చేయగా వర్షాభావంతో దిగుబడి రాలేదు. దీంతో అప్పు తీర్చలేక ఆదివారం పురుగుమందు తాగి చనిపోయారు. సిరిసిల్ల(D) పోతుగల్‌లో దేవయ్య, భూపాలపల్లి(D) మొగుళ్లపల్లిలో రాజు, మహబూబాబాద్(D) వేములపల్లిలో వెంకన్న పంట దిగుబడి రాకపోవడంతో అప్పు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నారు.
Similar News
News February 25, 2025
3 ఓవర్లలోనే సెంచరీ.. మీకు తెలుసా?

ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఓ రికార్డును సృష్టించారని మీకు తెలుసా? 1931లో జరిగిన ఓ దేశవాళీ మ్యాచ్‌లో 3 ఓవర్లలోనే సెంచరీ చేశారు. ఆ సమయంలో ఓవర్‌కు 8 బంతులు ఉండేవి. తొలి ఓవర్‌లో 33, రెండో దాంట్లో 40, మూడో ఓవర్లో 27 పరుగులు చేసి సెంచరీ బాదారు. ప్రస్తుతం ఓవర్‌కు 6 బంతులే ఉండటంతో 3 ఓవర్లలో సెంచరీ చేయడం అసాధ్యమే.
*ఇవాళ బ్రాడ్‌మన్ వర్ధంతి
News February 25, 2025
హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సినవి!

* మీరు ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తి అయినప్పటికీ, వినయంగా ఉండండి
* ఇతరుల సంక్షేమం కోసం మీ అధికారాలను ఉపయోగించండి
* ఇంద్రియాలను మీరు నియంత్రించాలి. అవి మిమ్మల్ని నియంత్రించకూడదు
* పాపాలు చేసే వారి పట్ల దయ చూపొద్దు
* నిర్భయంగా, నమ్మకంగా ఉండండి
* క్రమం తప్పకుండా శారీరక & మానసిక బలాన్ని మెరుగుపరుచుకోండి
News February 25, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే విజయం: బండి

TG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లోనూ బీజేపీనే గెలుస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఆ విషయం తెలిసి CM హడావుడిగా ప్రచారం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోతోందని దుయ్యబట్టారు. కులగణన తప్పుగా సాగిందని, 32శాతమే రిజర్వేషన్లు అమలు చేసే కుట్ర జరుగుతోందన్నారు. ప్రభుత్వ లెక్కల్లో బీసీల సంఖ్య ఎలా తగ్గిందని ప్రశ్నించారు.