News February 25, 2025
జనసంద్రంగా శ్రీశైలం

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రం జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినవారు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మల్లన్నను దర్శించుకుని సాయంత్రం జరిగే ఉత్సవాలను తిలకించి భక్తులు తరిస్తున్నారు.
Similar News
News January 17, 2026
MBNR: రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వివరాలు

రాష్ర్ట సీఎం రేవంత్ రెడ్డి శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మ.1:30కి చిట్టి బోయినపల్లిలో హెలికాప్టర్ దిగనున్నారు. 1:35 తెలంగాణ గురుకుల విద్యార్థులు నృత్య ప్రదర్శనతో స్వాగతం పలుకుతారు. 1:45 త్రిబుల్ ఐటీ కళాశాల శంకుస్థాపన చేస్తారు. 2:15 ఎంవీఎస్ డిగ్రీ కళాశాలకు రోడ్డు ద్వారా చేరుకుంటారు. 2:30 మున్సిపల్, విద్య కోసం కోసం శంకుస్థాపన చేయనున్నారు. 2:30-4:00 వరకు పబ్లిక్ మీటింగ్ జరగనుంది.
News January 17, 2026
KMR, NZB జిల్లాలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే?

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని వివిధ మార్కెట్లలో కూరగాయల ధరల వివరాలు ఇలా ఉన్నాయి.(కేజీలలో): టమాట-రూ.30/-, వంకాయలు-50/-, బెండకాయలు-80/-, పచ్చిమిర్చి-60/-, కాకరకాయలు-60/-, బీరకాయలు-80/-, చిక్కుడుకాయ -80/-,దోసకాయలు-50/-, ఆలుగడ్డ-40/-, ఉల్లిగడ్డలు-50/-, క్యాబేజి-50/-, క్యారెట్-50/-, కాలిఫ్లవర్-60/- క్యాప్సికం-50/-, దొండకాయలు-60/-, పాలకూర-60/-, తోటకూర-రూ.60/- ధరలు పలుకుతున్నాయి.
News January 17, 2026
వనపర్తి: 33 వార్డులు, 99 పోలింగ్ బూత్‌లు

ఎలాంటి లోపాలు లేకుండా ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని పుర కమిషనర్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శుక్రవారం పట్టణంలోని పురపాలికలో పుర ఉద్యోగులతో కలిసి ఆయన ఫొటోలతో కూడిన 33 వార్డుల్లోని 99 పోలింగ్ స్టేషన్‌ల తుది ఓటర్ జాబితాను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా రూపకల్పనలో పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పుర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


