News February 25, 2025

ఆదిలాబాద్‌లో యువకుడి దారుణ హత్య

image

ఆదిలాబాద్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మార్కెట్ యార్డ్ వెనకాల ఇందిరానగర్‌లో రవితేజ (30) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం హత్య చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మృతుడు క్రాంతినగర్ వాసిగా గుర్తించినట్లు తెలిపారు.

Similar News

News January 21, 2026

ఆదిలాబాద్: తొలిసారిగా JEE మెయిన్స్ పరీక్షలు

image

దేశవ్యాప్తంగా ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో తొలిసారిగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 21, 22, 23, 24, 28వ తేదీల్లో రెండు విడతల్లో పరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని నిబంధన విధించడంతో అభ్యర్థులు ముందుగానే కేంద్రానికి చేరుకున్నారు. అధికారులు తనిఖీలు చేసి విద్యార్థులను లోపలికి అనుమతించారు.

News January 20, 2026

ఆదిలాబాద్: లారీ ఢీకొని వ్యక్తి మృతి

image

ఆదిలాబాద్‌లోని తిరుపల్లి వద్ద మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి (50) లారీ కిందపడి దుర్మరణం చెందాడు. కాలినడకన రోడ్డు పక్క నుంచి వెళ్తుండగా రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు 2 టౌన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టామన్నారు.

News January 20, 2026

ADB: రేపు డిప్యూటీ సీఎం రాక.. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నెల 21న జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉట్నూర్ మండలం దంతన్ పల్లి, కుమ్మరి తండాలలో మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్ పర్యటించి ఏర్పాట్లు పరిశీలించారు. ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమిపూజ తదితర కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు.