News February 25, 2025

ఆదిలాబాద్‌లో యువకుడి దారుణ హత్య

image

ఆదిలాబాద్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మార్కెట్ యార్డ్ వెనకాల ఇందిరానగర్‌లో రవితేజ (30) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం హత్య చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మృతుడు క్రాంతినగర్ వాసిగా గుర్తించినట్లు తెలిపారు.

Similar News

News July 4, 2025

విశాఖ: ఈ ప్రాంతాల్లో M.I.G. అపార్ట్మెంట్ల నిర్మాణం

image

విశాఖలోని 3 ప్రాంతాల్లో M.I.G. అపార్ట్మెంట్లను V.M.R.D.A. నిర్మించనుంది. మిథిలాపురి వుడా కాలనీ, మారికవలస, వేపగుంటల్లో మధ్యతరగతి కుటుంబాల కోసం 2BHK, 2.5 BHK, 3 BHK అపార్ట్మెంట్లు నిర్మిస్తారు.‌ PPP పద్ధతిలో నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపిందని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. M.I.G. అపార్ట్మెంట్ల నిర్మాణానికి గతంలో డిమాండ్ సర్వే నిర్వహించారు. ఆదరణ లభించడంతో వీటి నిర్మాణానికి నిర్ణయించారు.

News July 4, 2025

GNT: సీలింగ్ భూముల క్రమబద్ధీకరణపై జేసీ సమీక్ష

image

సీలింగ్ భూములు క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిన వారు ఈ ఏడాది డిసెంబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ సూచించారు. కాంపిటెంట్ అథారిటీ, అర్బన్ ల్యాండ్ సీలింగ్స్ అధికారులతో కలిసి తహశీల్దార్‌లు, సర్వేయర్‌లతో గుంటూరు కలెక్టరేట్‌లో జేసీ శుక్రవారం సమీక్ష చేశారు. సీలింగ్ భూముల క్రమబద్ధీకరణ కోసం గతంలో వచ్చిన అర్జీలపై విచారణ జరిపి అధికారులు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.

News July 4, 2025

రాష్ట్రంలో 3 దాడులు.. 6 కేసులు: అంబటి

image

AP: రాష్ట్రంలో పరిస్థితి మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరిగా తయారైందని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. రోజూ ఎక్కడో ఓ చోట YCP కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. ‘రెడ్ బుక్ కోసం కొందరు అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లు కలిసి పని చేస్తున్నారు. పోలీసులు ఈ దాడులను ఆపటం లేదు. ఎవరు చంపుకున్నా YCP నేతలపైనే కేసులు పెడుతున్నారు. కూటమి సర్కార్ తాటాకు చప్పుళ్లకు తాము భయపడం’ అని స్పష్టం చేశారు.