News February 25, 2025
ఐదుగురికి జీవిత ఖైదు.. ఆ వీడియోనే సాక్ష్యం!

శింగనమల నియోజకవర్గం నార్పలలో మట్టి పవన్ అనే యువకుడి <<15562592>>హత్య<<>> కేసులో ఐదుగురికి జీవిత ఖైదు శిక్ష పడిన విషయం తెలిసిందే. 2020లో పవన్ను స్టీల్ రాడ్డు, కర్రలతో దారుణంగా కొట్టి హత్య చేశారు. ముద్దాయిల్లో ఒకరైన సుధాకర్ దాడి దృశ్యాలను చిత్రీకరించాలని స్నేహితులకు సూచించారు. ‘ఈ వీడియో చూసినవారు మనమంటే భయపడాలి. సుధాకర్ అంటే ఒక బ్రాండ్’ అంటూ చితకబాదారు. ఇప్పుడు ఆ వీడియో ఫుటేజీ సాక్ష్యంగానే జడ్జి తీర్పు చెప్పారు.
Similar News
News November 6, 2025
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి అమ్మాయిలు

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలలో తాడిపత్రి అమ్మాయిలు సత్తా చాటారు. SGFI ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో అండర్-17 విభాగంలో అర్షియ, అవనిక, చాందిని.. అండర్-14 విభాగంలో ఆయేషా జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు కబడ్డీ కోచ్ లక్ష్మీ నరసింహ తెలిపారు.
News November 5, 2025
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి, విస్తరించాలని కలెక్టర్ ఆనంద్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న గ్రామపంచాయతీ స్థాయి వరకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉంటుందని అన్నారు.
News November 4, 2025
పోలీస్ పీజీఆర్ఎస్కు 105 పిటిషన్లు: ఎస్పీ

అనంతపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 105 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పిర్యాదు దారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.


