News February 25, 2025
HYD: జేసీపీగా బాధ్యతలు స్వీకరించిన జోయల్

HYD నగర ట్రాఫిక్ విభాగం సంయుక్త పోలీస్ కమిషనర్‌గా జోయల్ డేవిస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సైబరాబాద్ ట్రాఫిక్ చీఫ్‌గా పనిచేశారు. ఆయన కొన్నేళ్లుగా నగర ట్రాఫిక్‌కు ఐజీ ర్యాంకులో ఉండే అధికారిగా అదనపు సీపీ హోదాలో బాధ్యతలు వహిస్తుండగా.. ప్రస్తుతం డీఐజీ ర్యాంకులో ఉండటంతో ఆయనను సంయుక్త పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
Similar News
News February 25, 2025
వరంగల్: రెండు రోజులు మద్యం అమ్మకాలు బంద్

వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేటి(మంగళవారం) నుంచి గురువారం వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. నేటి సాయంత్రం 4 గంటల నుంచి 27 తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం అమ్మకాలు ఉండవని అధికారులు తెలిపారు. వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్స్, మూసివేయాలని కలెక్టర్ సత్య శారద దేవి ఆదేశించారు.
News February 25, 2025
జిల్లాకు చేరుకున్న ప్రశ్న పత్రాలు

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రానికి చేరాయి. రాష్ట్ర విద్యాశాఖ నుంచి ప్రత్యేక వాహనంలో పకడ్బందీ బందోబస్తు నడుము ప్రశ్నపత్రాలను జిల్లా కేంద్రానికి పంపారు. వీటిని కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి
News February 25, 2025
హుస్నాబాద్: ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు: మంత్రి పొన్నం

మార్చి 1న ఒకేరోజు ప్రభుత్వం లక్ష కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ‘X ‘వేదికగా వెల్లడించారు. ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ చేస్తామన్నారు. మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని తెలిపారు. పదేళ్ల తర్వాత పేద బిడ్డల కలను ప్రభుత్వం నెరవేర్చడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.