News March 21, 2024
నార్కట్‌పల్లి: తనిఖీలు ముమ్మరం.. రూ.10 లక్షలు సీజ్

పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. గురువారం నార్కట్‌పల్లిలో చేపట్టిన తనిఖీలో ఓ వ్యక్తి కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న పది లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ అంతిరెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎవరూ రూ.50 వేలకు మించి తీసుకెళ్లొద్దని, ఒకవేళ తీసుకెళ్తే ఆ డబ్బుకు సంబంధించి ఆధారాలు వెంట తీసుకెళ్లాలని సూచించారు.
Similar News
News September 9, 2025
NLG: తుది ఓటరు జాబితా విడుదలకు కసరత్తు!

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఓటరు జాబితాను బుధవారం విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మొత్తం 33 మండలాల్లో 33 జడ్పీటీసీ, 353 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. ముసాయిదా ఓటరు జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అధికారులు సూచించారు.
News September 9, 2025
NLG: పోషణ ట్రాకర్, NHTS యాప్‌లతో అష్టకష్టాలు!

జిల్లాలో అంగన్వాడీ టీచర్లు పోషణ ట్రాకర్, NHTS యాప్‌లతో అష్టకష్టాలు పడుతున్నారు. పోషణ ట్రాకర్ యాప్లో లబ్దిదారుల ముఖ హాజరు నమోదుకు ఇబ్బంది తప్పడం లేదు. ఫేస్‌ను యాప్లో గుర్తించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు సపోర్ట్ చేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు. సర్వర్ సమస్యతో యాప్ లు మొరాయిస్తుండటంతో కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. కొంతమంది నెలలో ఐదారుసార్లు కేంద్రాలకు రావాల్సి వస్తుంది.
News September 9, 2025
NLG: జీపీఓలు వచ్చేశారు!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ పాలన అధికారులు ఎట్టకేలకు విధుల్లో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,016 మంది జీపీఓలను నియమించగా నల్గొండ జిల్లాకు 276 మందిని కేటాయించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి దిశానిర్దేశంలో అధికారులు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. రెవెన్యూ గ్రామాలతో ఏర్పాటుచేసిన క్లస్టర్ల వారీగా జీపీఓలకు పోస్టింగ్ ఇచ్చారు.