News February 25, 2025
నాగకర్నూల్ చెరువులో మహిళ మృతదేహం

నాగర్‌కర్నూల్ పట్టణ సమీపంలోని కేసరి సముద్రం చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన సోమవారం సాయంత్రం వెలుగు చూసింది. చెరువులోని బతుకమ్మ ఘాట్ దగ్గర గుర్తుతెలియని మహిళా మృతదేహం కనిపించినట్లు స్థానికులు తెలిపారు. చెరువులోని మహిళా మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 25, 2025
హుస్నాబాద్: ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు: మంత్రి పొన్నం

మార్చి 1న ఒకేరోజు ప్రభుత్వం లక్ష కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ‘X ‘వేదికగా వెల్లడించారు. ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ చేస్తామన్నారు. మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని తెలిపారు. పదేళ్ల తర్వాత పేద బిడ్డల కలను ప్రభుత్వం నెరవేర్చడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
News February 25, 2025
జోకర్‌గా జగన్.. జనసేన ఎమ్మెల్యే సెటైర్

AP: ప్రజా సమస్యల గురించి ఆలోచించకుండా జగన్ ఓ జోకర్‌గా మిగిలారని జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తోన్న ఆయన.. ప్రజా తీర్పును గౌరవించలేదని దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోందని చెప్పారు.
News February 25, 2025
జపాన్ మీడియాతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జపాన్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. మార్చి 28న ‘దేవర’ రిలీజ్ కానుండటంతో ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్ మార్చి 22న జపాన్‌కు వెళ్లనున్నారు. ఈక్రమంలో అక్కడి మీడియాతో తారక్ వర్చువల్ ఇంటర్వ్యూలు ప్రారంభించినట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.