News February 25, 2025

గోల్కొండ, చార్మినార్‌కు టూరిస్టుల ఓటు

image

TG: దేశంలో అత్యధిక మంది సందర్శించిన చారిత్రక ప్రదేశాల్లో గోల్కొండ 6, చార్మినార్ 9వ స్థానాల్లో నిలిచాయి. 2022-24కు గానూ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో టాప్-3లో తాజ్ మహల్, కోణార్క్‌లోని సూర్య దేవాలయం, ఢిల్లీలోని కుతుబ్ మినార్ ఉన్నాయి. ఇక 2019 తర్వాత హైదరాబాద్‌కు సందర్శకుల తాకిడి 30 శాతం పెరిగినట్లు సర్వే వెల్లడించింది.

Similar News

News February 25, 2025

చంద్రబాబు ఇంటిపై దాడి కేసు నిందితులకు ముందస్తు బెయిల్

image

AP: YCP హయాంలో చంద్రబాబు ఇల్లు, TDP ఆఫీసుపై జరిగిన దాడి కేసుల్లో నిందితులకు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీంతో దేవినేని అవినాశ్, జోగి రమేశ్ సహా 20 మందికి ఊరట దక్కింది. అయితే విచారణకు సహకరించాలని, దేశం వదిలి వెళ్లొద్దని ఆదేశించింది. విచారణను 3 ఏళ్లు తాత్సారం చేశారని వ్యాఖ్యానించింది. నిందితులకు తాము తప్పు చేశామని తెలుసని, అధికారం పోయాక కోర్టుకు వచ్చారని ప్రభుత్వం వాదనలు వినిపించింది.

News February 25, 2025

జోకర్‌గా జగన్.. జనసేన ఎమ్మెల్యే సెటైర్

image

AP: ప్రజా సమస్యల గురించి ఆలోచించకుండా జగన్ ఓ జోకర్‌గా మిగిలారని జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తోన్న ఆయన.. ప్రజా తీర్పును గౌరవించలేదని దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోందని చెప్పారు.

News February 25, 2025

జపాన్ మీడియాతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జపాన్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. మార్చి 28న ‘దేవర’ రిలీజ్ కానుండటంతో ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్ మార్చి 22న జపాన్‌కు వెళ్లనున్నారు. ఈక్రమంలో అక్కడి మీడియాతో తారక్ వర్చువల్ ఇంటర్వ్యూలు ప్రారంభించినట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

error: Content is protected !!