News February 25, 2025
అకౌంట్లలో డబ్బులు.. సీఎం కీలక ప్రకటన

TG: మార్చి 31లోపు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటివరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు నిధులు జమ చేసింది. ఇకపై మిగతావారికీ అందజేస్తామని సీఎం వెల్లడించారు. కాగా తొలుత ఎకరం వరకు ఉన్న 17 లక్షల మందికి రూ.557.54Cr, రెండెకరాల వరకు ఉన్న 13.23 లక్షల మందికి రూ.1130.29Cr, మూడెకరాల వరకు ఉన్న 9.56 లక్షల మందికి రూ.1230.98Cr ఖాతాల్లో వేశారు.
Similar News
News January 16, 2026
రూ.200 కోట్ల కలెక్షన్లు దాటేసిన MSVPG

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ‘థియేటర్ల లోపల ఈలలు, బయట హౌజ్‌ఫుల్ బోర్డులు.. రూ.200 కోట్ల కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు’ అని రాసుకొచ్చింది. వీకెండ్ కావడంతో రేపు, ఎల్లుండి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది.
News January 16, 2026
IFFCOలో అప్రెంటిస్ పోస్టులు

<
News January 16, 2026
ముత్యపు ఉంగరం ధరించడం వల్ల ప్రయోజనాలు

చంద్రుడికి ప్రతీక ముత్యాన్ని భావిస్తారు. ఆ ఉంగరం ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. అసలైన ముత్యాన్ని వెండి ఉంగరంలో పొదిగించి సోమవారం ధరిస్తే మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయట. ఇది కోపం, ఒత్తిడిని తగ్గించి నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు. అలాగే మహిళల్లో హార్మోన్ల సమతుల్యతకు ఇది మేలు చేస్తుందట. నకిలీ ముత్యంతో లాభాలు ఉండవట.


