News February 25, 2025

NLG: క్విజ్.. వీటికి సమాధానాలు తెలుసా?

image

☞ఎవరికాలంలో నల్గొండ నీలగిరిగా ప్రసిద్ధి చెందింది?
☞భూదానోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
☞దేశోద్ధారక గ్రంథమాలను ఎవరు స్థాపించారు?
☞రావి నారాయణరెడ్డి జన్మస్థలం?
☞‘పల్లెటూరి పిల్లగాడ’ పాటను ఎవరు రచించారు?
★పై ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ చేయగలరు?

నోట్: మధ్యాహ్నం 2 గంటలకు ఇదే ఆర్టికల్‌లో జవాబులను చూడొచ్చు.

SHARE IT..

Similar News

News July 7, 2025

కిలోకు రూ.12 చెల్లించి మామిడి కొనుగోళ్లు

image

AP: మద్దతు ధర లేక అల్లాడుతున్న తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం ఆదుకుంటోంది. ప్రస్తుతం కేజీకి రూ.8 చెల్లిస్తుండగా, ప్రభుత్వం అదనంగా రూ.4 ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిలో మామిడికి రూ.12 చెల్లిస్తున్నారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 3.08 మెట్రిక్ టన్నుల మేర మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్ల వారు కొనుగోలు చేశారు.

News July 7, 2025

పాశ మైలారం: ఆచూకీ తెలియని 8 మంది వివరాలు

image

పాశ మైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇంకా 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. వెంకటేశ్, రవి, రాహుల్, విజయ్, ఇర్ఫాన్, అఖిలేశ్, జస్టిన్, శివాజీ ఆచూకీ లభించలేదని అధికార వర్గాలు తెలిపాయి. వీరి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు పటాన్‌చెరులోనే పడిగాపులు కాస్తున్నారు.

News July 7, 2025

PHOTO OF THE DAY..❤❤

image

అమ్మానాన్న లేరు. వీధివీధి తిరిగి భిక్షం ఎత్తుకోవడం, బస్టాండ్లలో నిద్రపోయే దీనపరిస్థితి ఆ ఇద్దరు చిన్నారులది. వాళ్లకూ ఓ మంచిరోజు వచ్చింది. ‘<<16930776>>సార్.. మేమూ చదువుకుంటాం<<>>’ అంటూ నెల్లూరు VRస్కూల్ వద్ద మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్‌ను వేడుకోవడంతో వారి జీవితం మారిపోయింది. వారం తిరగకముందే మంత్రి లోకేశ్ చేతుల మీదుగా అదే స్కూల్లో అడ్మిషన్లు పొందారు. ఇప్పుడు ఆ ఇద్దరూ అందరిలా పాఠాలు నేర్చుకోనున్నారు.