News February 25, 2025
తిరుపతి: ప్రొఫెసర్‌నే మోసం చేశారు..!

సైబర్ నేరగాళ్లు తిరుపతి SVUలో ఓ ప్రొఫెసర్‌ను బురిడీ కొట్టించారు. ఆయన ఫోన్ నంబర్‌ను A7*VIP Sharekhan కమ్యూనికేషన్ అనే వాట్సాప్ గ్రూపులో చేర్చారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తూ లాభాలు పొందవచ్చని ఆశ చూపారు. దీంతో ఆయన వివిధ ఖాతాల నుంచి రూ.25 లక్షలు పంపగా.. కేటుగాళ్లు ప్రొఫెసర్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో విలువ రూ.2.15 కోట్లుగా చూపించారు. డబ్బును విత్ డ్రా చేయగా రాకపోవడంతో మోసపోయినట్లు ఆయన గుర్తించారు.
Similar News
News February 25, 2025
CT: పాక్ పరిస్థితిపై క్రికెట్ ఫ్యాన్స్ సెటైర్లు

29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్ టోర్నీ రేస్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ జట్టుపై క్రికెట్ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. ‘టోర్నీ నుంచి తప్పుకున్నా ఆతిథ్యం ఇవ్వడం.. చోరీకి గురైన ఫోన్‌కు ఈఎంఐలు కట్టడం లాంటిదే’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత్, న్యూజిలాండ్‌పై పాక్ ఓటమి పాలవ్వగా బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడాల్సి ఉంది.
News February 25, 2025
మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

TG: నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉమెన్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ద్వారా ఉచితంగా ఈవీ ఆటో, టూ వీలర్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనుంది. 18-45 ఏళ్ల మహిళలకు 45-60 రోజుల పాటు శిక్షణ అందించనున్నట్లు పేర్కొంది. డ్రైవింగ్ నేర్చుకున్న మహిళలకు సబ్సిడీపై ఈవీ ఆటోలు అందివ్వనున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 45 మందికి ట్రైనింగ్ ఇవ్వగా.. వచ్చే నెల 5 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ కానుంది.
News February 25, 2025
NZB: 96.78 శాతం పరీక్షలు రాసిన విద్యార్థులు

నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో 96.78 శాతం హాజరు నమోదైందని గురుకులాల ప్రవేశ పరీక్షల రీజనల్ కో ఆర్డినేటర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 సెంటర్లు ఏర్పాటు చేశారన్నారు. పరీక్షల కోసం 7,906 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 7,651 మంది పరీక్షలు రాసినట్లు వెల్లడించారు. కాగా 255 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.